బాప్‌ రే...బాలయ్య హీరోయిన్ అందాలు (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ఇప్పటికే సోనాల్ చౌహాన్ ఓ హీరోయిన్‌గా ఎంపిక కాగా, మరో హీరోయిన్‌గా రాధిక ఆప్టే(రక్త చరిత్ర ఫేం)ను ఎంపిక చేసారు. వారాహి చలనచిత్రం పతాకంపై కొర్రపాటి సాయి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్‌పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కొత్తగా మరో హీరోయిన్‌ను ఎంపిక చేయడంపై దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ...రాధిక ఆప్టే ఈ కథకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను ఆమె చేయబోతోంది. హీరోయిన్ల ఇద్దరి క్యారెక్టర్లు సరిసమానంగా ఉంటాయి అని తెలిపారు. త్వరలో రాధిక ఆప్టే షూటింగ్‌లో పాల్గొననుంది.

స్లైడ్ షోలో...రాధిక ఆప్టేకు సంబంధించిన హాట్ ఫోటలు, సినిమాకు సంబంధించిన వివరాలు తెలుసుకుందా.....

రాధిక ఆప్టే

రాధిక ఆప్టే

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్త చరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన రాధిక ఆప్టే, ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ‘ధోనీ' చిత్రంలో కూడా నటించింది.

బాలయ్య హీరోయిన్‌గా

బాలయ్య హీరోయిన్‌గా

రక్త చరిత్రం, ధోనీ చిత్రాల తర్వాత రాధిక ఆప్టే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి ఎంపికయింది.

 షూటింగ్ వివరాలు

షూటింగ్ వివరాలు

షూటింగ్ వివరాలు

హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు

హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు

బాలయ్య, బోపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం టింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇటీవల హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 26 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. త్వరలో రాధిక ఆప్టే షూటింగ్‌లో పాల్గొననుంది.

సింహాను మించిన సినిమా..

సింహాను మించిన సినిమా..

గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ‘సింహా' చిత్రం వచ్చింది. తాజాగా ఆయనతో మరో చిత్రం చేస్తున్న బోయపాటి మాట్లాడుతూ...‘సింహా'ను మించేలా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం

మ్యూజిక్ మిస్సైల్ దేవిశ్రీ ప్రసాద్ తొలి సారిగా బాలయ్య హీరోగా రూపొందుతున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సినిమాకు దేవిశ్రీ సంగీతం అంటే అంచనాలు ఏ రేంజిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.

లెజెండ్

లెజెండ్

ఈ చిత్రానికి ప్రస్తుతం జయసింహ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్లున్నారు. త్వరలో ఈచిత్రానికి ‘లెజెండ్' అనే టైటిల్ ఫైనల్ చేసే అవకాశం ఉందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

బాలయ్య కోసం స్పెషల్ బైక్

బాలయ్య కోసం స్పెషల్ బైక్

ఈ చిత్రంలో బాలకృష్ణ ఓ స్పెషల్ బైక్ పై కనిపించి ఫ్యాన్స్ ని అలరించనున్నారు. ఈ బైక్ తయారీ కోసం స్పెషల్ డిజైనర్స్ ని పిలిపించారు. ఈ బైక్ పై కస్టం పెయింటింగ్స్ మరియు స్టైలిష్ చక్రాలు ఉండనున్నాయి.

నిర్మాతలు

నిర్మాతలు

14 రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోపీ ఆచంట, రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X