For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాథికా ఆప్టేని రాత్రికి రూమ్ కు రమ్మన్న హీరో ఇక్కడ వాడే? , సంచలన వివాదం

  By Srikanya
  |

  ముంబై‌: అదేంటో రాధికా ఆప్టే ఏం చేసినా అది సంచలనం అవుతోంది. అలాగే ఏం మాట్లాడినా అది హాట్ టాపిక్ అవుతోంది. నిన్నటివరకూ నగ్న దృశ్యాల వీడియోతో మీడియాలో నలిగిన రాధిక మరోసారి మీడియాలో చేసిన కామెంట్ తో అందరి దృష్టిలో పడింది. ఈ సారి కాస్టింగ్ కోచ్ వ్యవహారం తనకూ అనుభవమైంది అంటూ మాట్లాడింది.

  అయితే ఈ సారి ఆమె డైరక్ట్ గా మనవైపు ఎక్కుపెట్టి బాణాలు వదిలింది. మన దక్షిణాది హీరో తనను రాత్రికి రూమ్ కు రమ్మన్నాడంటూ పిలిచాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా మాట్లాడుకునేలా చేసింది. తనకు ఫోన్ చేసిన ఆ స్టార్ రాత్రికు రూమ్ కు రా అన్నాడని, అయితే తాను వదలలేదని అతని దులిపేసానని అంది.

  తెలుగులో రక్తచరిత్ర, ధోని, లెజెండ్, లయన్ సినిమాల్లో నటించారు. సౌత్ లో తెలుగు తర్వాత తమిళం, మలయాళ సినిమాల్లోనూ చేశారు. రాధిక ఒంటరి కాదు. లండన్ కు చెందిన సంగీత కళాకారుడు బెనెడిక్ట్‌ టేలర్‌ తో వివాహమైంది. ఇంతకీ ఏ హీరోని ఉద్దేశించి రాధిక కామెంట్స్ చేసింది, ఎవరా సౌతిండియా హీరో అనేది ఇప్పుడు అనేక గుసగుసలకు ఆస్కారమిచ్చింది.

  స్లైడ్ షోలో అసలేం జరిగింది, మరిన్ని విశేషాలు....

  చపల బుద్ది చూపించబోయాడు

  చపల బుద్ది చూపించబోయాడు

  తన తాజా చిత్రం ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంగ్లీష్ సినీ వెబ్‌సైట్‌తో ఆమె మాట్లాడుతూ.. ‘నా తొలినాళ్లలో అందరిలానే నాకూ సినిమా కష్టాలు తప్పలేదు. అయితే అవకాశం కోసం ఎప్పుడూ నేను అడ్డదారి మాత్రం తొక్కలేదు. ఎప్పుడో ఓసారి ఓ నటుడు... దక్షిణాదికి చెందిన వాడనుకుంటా, ఫోన్‌ చేసి నన్ను తన గదికి రమ్మని పిలిచారు. అంతేకాకుండా తన చపలబుద్ధిని ప్రదర్శిస్తూ మాట్లాడారు. నాకు ఒక్కసారిగా కోపం నషాళానికి అంటింది. ఆ వ్యక్తిని అప్పుడే దుమ్ముదులిపేశా..' అంటూ చెప్పుకొచ్చింది రాధికా.

  అలాంటి పరిస్ధితుల్లో ధైర్యంగా నిలబడ్డా

  అలాంటి పరిస్ధితుల్లో ధైర్యంగా నిలబడ్డా

  ‘అవసరం' మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. ఈ విషయంలో ముఖ్యంగా సినిమావాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ ఏంచేస్తారు. ‘ఒక్కఛాన్స్‌' కోసం కళ్లు కాయలు కాచేలా చూసే వాళ్లెందరో..! ఇలాంటి పరిస్థితితే నాకూ ఎదురైంది. అయితే నేను ధైర్యంగా నిలబడ్డా. అలాంటి కాల్స్ మాత్రం ఎక్సపెక్ట్ చేయలేదని చెప్తోంది.

  తెలుగులో ఆ రెండే మరి

  తెలుగులో ఆ రెండే మరి

  రజనీ సరసన ‘కబాలి' చిత్రంలోనూ రాధికా ఆప్టే చేసింది. అయితే రజనీకాంత్ గురించి ఆమె చాలా గొప్పగా చెప్పుకొచ్చింది కాబట్టి ఈమె చెప్పిన సౌత్ హీరో ల్లో రజని ఉండనట్లే లెక్క. మరెవరు ఈ లిస్ట్ లో ఉండే అవకాసం ఉంది. బాలయ్య సరసన లెజెండ్, లయన్ సినిమాలలో చేసింది ఆమె. తెలుగులో ఈ రెండు చిత్రాలే చేసింది. మళయాళంలో కొన్ని చిత్రాలు చేసింది. మరి ఎవరు ఈమెకు పోన్ చేసి పిలిచారో

  ఇప్పుడే గుర్తు కు రావటానికి కారణం

  ఇప్పుడే గుర్తు కు రావటానికి కారణం

  నటిగా కెరీర్‌ ప్రారంభించిన తొలినాళ్లలో తాను సినిమా కష్టాలు ఎదుర్కొన్నానంటూ చెప్పుకొచ్చింది ఈ ‘కబాలి' సుందరి. సాంఘిక దురాచారాలపై అమ్మాయిల పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ‘పార్చ్‌డ్‌'లో రాధికా నటించారు. వాస్తవికతకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందుకే ఈ సందర్బంగా అవన్నీ గుర్తుకు వచ్చాయంది. అయితే ఆమె ఇలాంటి విషయాలంటే ఎలా ఎదుర్కోవాలో తెలసంది.

  తెలుగులో చేయనంది

  తెలుగులో చేయనంది

  రాధికా ఆప్టే ఇచ్చే బోల్డ్ స్ట్టేట్మెంట్స్ , ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీపై ఆమె చేసిన విమర్శలు అంతటా హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు ఇండస్ట్రీని ఆమె దుమ్మత్తిపోసింది. ఇక్కడ మేల్ డామినేషన్ అని విరుచుకుపడింది. తెలుగులో సినిమాలు చేయటం తనకు ఇష్టం లేదని తెగించి చెప్పింది. ఇండస్ట్రీలోని చాలా మంది ఆడవాళ్ల ఇబ్బందులు గురించి ఆమె చెప్పుకొచ్చింది.

  విమర్శలు పట్టించుకోను

  విమర్శలు పట్టించుకోను

  బ‌హుభాష న‌టి రాధికా ఆమ్టే.. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ మంచి పాత్ర‌లు వ‌స్తే చాలు న‌టించేందుకు ముందు వ‌రుస‌లో ఉంటుంది.విమర్శలు పట్టించుకోదు. చేస్తున్న పాత్రకు నూరుపాళ్లు న్యాయం చేయడమే లక్ష్యం. పాత్ర ఏదైనా సరే. వందకు వంద మార్కులు పడాల్సిందే. అందం.. అభినయం. రెండింటినీ మేళవించి అందరినీ ఆకట్టుకోవడమే తెలుసు.

  హీరోలు జాగ్రత్తగా ఉండాలి

  హీరోలు జాగ్రత్తగా ఉండాలి

  స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్.. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. ఇలా గిరి గీసుకు కూర్చోలేదు. ఎక్కడ నటనకు అవకాశం ఉంటే అక్కడ అడుగుపెట్టేయడమే రాధికా నైజం. నాటకరంగంతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే సినిమాల్లోను బిజీ అయ్యారు. ‘ఫోబియా', ‘బద్లాపూర్‌', ‘మాంఝీ', ‘హంటర్‌' తదితర చిత్రాల్లో మెప్పించిన రాధికా ఆప్టే ఇటీవల ‘కబాలి' చిత్రంలో రజినీకాంత్‌ పక్కన మెరిశారు. రాధికా ఆప్టే సొంతూరు పుణె. నాటకరంగమంటే ప్రాణం. అక్కడి నుంచే సినిమాల వైపు అడుగేశారు. కథక్ నేర్చుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యం ఉంది. కాబట్టి ఆమెతో అడుకుందామనుకునే హీరోలు కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి.

  తెలుగులో చేసింది కదా అని,

  తెలుగులో చేసింది కదా అని,

  తెలుగులో చేసింది కదా అని చిన్న చూపు చూడద్దు. ఈ మధ్యే ఇండియాలో అత్యధిక మంది గూగుల్ సెర్చ్ లో వెతికిన హీరోయిన్ రాధికే అని వెల్లడైన సంగతి తెలిసిందే. మరోవైపు బద్లాపూర్ - హంటర్ లాంటి సినిమాలతో.. ‘అహల్య' లాంటి ఇంటర్నేషనల్ రేంజి షార్ట్ ఫిలింతో తనేంటో చాటి చెప్పింది రాధికా. సినీ వర్గాల్లో రాధికకు ఎంత మంచి పేరుందో చెప్పడానికి తాజా ఉదాహరణ.. గోవాలో జరగిన ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్'లో ఆమె జ్యూరీ సభ్యురాలిగా ఎంపికవడం. ఇండియా చాలా ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఫిలిం ఫెస్టివల్ లో జ్యూరీ సభ్యులుగా మహా మహులే ఉంటారు. వాళ్ల స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ రేంజిలో ఉంటాయి.

  ఏం నేనొక్కదాన్నే ఆ సెక్సా సీన్స్ లో ఉన్నానా

  ఏం నేనొక్కదాన్నే ఆ సెక్సా సీన్స్ లో ఉన్నానా

  బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తాజా సినిమా 'పర్చెడ్' సినిమాలోని కొన్ని ఘాటైన దృశ్యాలు లీకయ్యి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో హీరోయిన్ రాధికకు సహనటుడు ఆదిల్ హుస్సేన్ అండగా నిలిచారు. ఈ దృశ్యాలు లీకవ్వడం సంగతి అటుంచి.. అసలు లీకైన వీడియోకు "రాధికా ఆప్టే సెక్స్ సీన్" అనే పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అంటున్నారు. ఆ దృశ్యాలకు "రాధికా ఆప్టే సెక్స్ సీన్" అనేపేరే ఎందుకు పెట్టారు.. "ఆదిల్ హుస్సేన్ సెక్స్ సీన్స్" అని అనొచ్చుగా? అనరు.. అంది రాధిక

  ఇంటిమేట్ సీన్ లో రెచ్చిపోయింది

  ఇంటిమేట్ సీన్ లో రెచ్చిపోయింది

  అజయ్ దేవగన్ నిర్మాణంలో లీనా యాదవ్ పార్షడ్ అనే మూవీ తెరకెక్కింది. 2015 టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో గతేడాదే ఈ చిత్రాన్ని ప్రదర్శించారు కూడా. ఇప్పటివరకూ ఇండియాలో అఫీషియల్ రిలీజ్ జరగలేదు కానీ.. ఈ మూవీలో రాధికా ఆప్టే చేసిన ఓ న్యూడ్ సీన్.. ఇప్పుడు ఆన్ లైన్ లీక్ అయిపోయింది. కంప్లీట్ టాప్ లెస్ గా కనిపిస్తున్న రాధిక.. ఇంటిమేట్ సీన్ లో రెచ్చిపోయి నటించింది. హాలీవుడ్ మూవీస్ లో కనిపించే బెడ్ రూమ్ సీన్స్ కు ఏమాత్రం తగ్గకుండా.. అన్ని యాంగిల్స్ లోను కసి చూపించేసింది.

  ఆ హాలీవుడ్ స్టార్స్ సెక్స్ సీన్స్ తో

  ఆ హాలీవుడ్ స్టార్స్ సెక్స్ సీన్స్ తో

  టైటానిక్ లో కేట్ విన్ స్లెట్.. మమ్మీ రిటర్న్స్ లో రేచెల్ వీజ్ నుంచి అనేక సినిమాల్లో నటించిన ఏంజెలీనా జోలీ.. ఈ తరం హీరోయిన్లలో జెన్నిఫర్ లారెన్స్ - పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ బ్యూటీ కీరా నైట్లీ ఇలా న్యూడ్ సీన్స్ చేసిన వారే. కానీ ఇండియన్ హీరోయిన్లలో ఇంత ఈరోటిక్ గా చేసేందుకు ట్రై చేసినోళ్లు ఎవరకూ కనిపించరు అంటూ రాధికా ఆప్టేని పొగిడేస్తున్నారు

  రాధిక అంటే అడల్ట్ అన్నంతగా

  రాధిక అంటే అడల్ట్ అన్నంతగా

  గతంలోనూ రాధిక నటించిన అడల్డ్ మూవీస్ కంటెంట్‌తో పాటు ప్రైవేట్ ఫోటోలూ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ... గత కొంతకాలంగా అమ్మడిని తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవలే విడుదలైన ఓ షార్ట్ ఫిల్మ్ లో రాధికా ఆప్టే నగ్న సన్నివేశాల్లో నటించింది. తాజాగా అజయ్‌ దేవగణ్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'పర్చేద్‌' సెట్స్‌ నుంచే రాధిక న్యూడ్‌ చిత్రాలు వచ్చేశాయి. తన న్యూడ్‌ చిత్రాలు నెట్‌లో విడుదలైపోతున్నా, ఎంతగా చర్చ జరిగినా రాధిక మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఈ మధ్యనే నోరు విప్పింది

  ఇన్ఫూలియన్స్ పడింది నా మీద

  ఇన్ఫూలియన్స్ పడింది నా మీద

  2010లో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రెండు భాగాల్లో తెరకెక్కించిన 'రక్త చరిత్ర'లో రాధిక చేశారు. ఈ సినిమా సెట్‌లో వర్మకు గుడ్‌ మార్నింగ్‌ అని చెబితే.. 'గుడ్‌ మార్నింగ్‌ చెప్పినంత మాత్రాన ఆ మార్నింగ్‌ నాకు అంతా మంచే జరుగుతుందా' అనే వారట. ఈ లాజిక్‌ నచ్చడంతో అప్పటి నుంచి గుడ్‌ మార్నింగ్‌ చెప్పడమే మానేశానని రాధిక చెప్తుంటారు. అలా చాలా విషయాలు ఆయన్నుంచి నేర్చుకున్నా అంటోంది

  కథక్ సైతం ఆమెకు వచ్చు

  కథక్ సైతం ఆమెకు వచ్చు

  రాధికా ఆప్టే ..మార్షల్‌ ఆర్ట్స్‌, కథక్‌లతో పాటు లండన్‌ వెళ్లి 'కంటెంపరరీ డ్యాన్స్‌ ఆఫ్‌ ఇండియా'లో శిక్షణ తీసుకున్నారు. అప్పట్నుంచీ 'కెమెరా ముందు నిలబడాలి, అది ఏ స్థాయి సినిమా అన్నది ముఖ్యం కాదు' అనుకున్నానని చెబుతుంటారు రాధికా ఆప్టే.

  ఆర్ట్ ప్రక్కన పెట్టి సెక్స్ సీన్స్ కే

  ఆర్ట్ ప్రక్కన పెట్టి సెక్స్ సీన్స్ కే

  ‘పార్చ్‌డ్‌' చిత్రంలోని నగ్న వీడియో బయటికి వచ్చాక అసలు సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు రసిక ప్రియులు. కానీ తమ సినిమాను అలాంటి దృష్టితో చూడొద్దని.. ఇదొక ముఖ్యమైన సమస్యపై చర్చిస్తూ తీసిన గొప్ప సినిమా అని అంటున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు. కానీ కళాత్మకమా కాదా అన్నది ముఖ్యం కాదు రాధికా ని "అలాచూడటం లో" ఉన్న కిక్ కోసమె ఎదురు చూసేవాళ్ళూ ఉన్నారు.

  ఒకటి కాదు రెండు కాదు ఏడు

  ఒకటి కాదు రెండు కాదు ఏడు

  లీనా యాదవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పార్చ్‌డ్‌' చిత్రాన్ని సీనియర్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ నిర్మించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం ఏడు దేశాల్లో విడుదలవడం విశేషం. ఇండియాలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది. ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేశారు. మరి సినిమా రిలీజైనపుడు జనాలు ఏ దృష్టితో చూస్తారో.. ఎలా ఆదరిస్తారో చూడాలి మరి.

  లీక్ వీడియో ఎఫెక్టే మరి

  లీక్ వీడియో ఎఫెక్టే మరి

  నిజానికి ఆమె లీక్ వీడియో కనుక బయిటకు రాకపోతే కనుక అసలు ఈ సినిమా గురించి మనలాంటివాళ్లకు తెలిసేదా అంటున్నారు కొందరు. అదీ నిజమే. సినిమాకు ఆ న్యూడ్ వీడియో చాలా బాగా ప్లస్ అయ్యింది. ఈ రోజున మీడియాలో ఈ రేంజి చర్చ జరుగుతోందంటే ఆ లీక్ వీడియోనే కారణమనేది కాదనలేని సత్యం

  విమర్శకులకు ఇదే జవాబు

  విమర్శకులకు ఇదే జవాబు

  రాధిక నటనని కొందరు మెచ్చుకున్నా, మరికొందరు విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్స్ పై అమ్మడు స్పందించింది. అటువంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు సిగ్గుపడటం లేదని, భయం కూడా లేదని తేల్చి చెప్పింది. తనకు ఇలా నటించడం కొత్తేమీ కాదని... తానూ హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగిన తనకు, న్యూడ్‌గా నటించేందుకు తనకు భయంలేదని చెప్పింది రాధిక. అలాగే దుస్తులు లేకుండా తన శరీరాన్ని చూసుకోవడానికి సిగ్గుపడటం లేదని చెప్పుకొచ్చింది.

  నగ్నంగా చేయటం మొదటి సారి కాదు కదా

  నగ్నంగా చేయటం మొదటి సారి కాదు కదా

  నగ్నంగా చాలామంది నటించారని, ఇలా నటించేందుకు ఎందుకు సిగ్గు పడాలి? అని మండిపడుతోంది... అంటూ ఎదురు ప్రశ్న వేస్తుంది. లీకైన పర్చేద్ సీన్ల‌పై కామెంట్స్ పట్టించుకోవట్లేదని, సినిమాల్లో నటించడం, అవి ఎప్పుడు విడుదల అవుతాయో ఎదురుచూడటమే తన పనని తన దైన శైలిలో సమాధానమిచ్చింది. తనపై విమర్శలు చేసేవారికి తన శరీరమే ఆయుధమని ఘాటుగా స్పందించింది రాధికా ఆప్టే.

  లీక్ వీడియోకు అంటూంటే అవార్డులు

  లీక్ వీడియోకు అంటూంటే అవార్డులు

  లీనా యాదవ్‌ దర్శకత్వంలో రాధికా ఆప్టే, తన్షిత ఛటర్జీ, సుర్విన్‌ చావ్లా, అదితి గుప్తా, అదిల్‌ హుస్సేన్‌ ప్రధాన పాత్రల్లో ‘పార్చ్‌డ్‌' రూపొందించారు. అజయ్‌ దేవగణ్‌ నిర్మించారు. ఇప్పటికే ఏడు దేశాల్లో విడుదలైన ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై 18 పురస్కారాలు దక్కించుకుంది. ఈ చిత్రం న‌లుగురు మ‌హిళ‌ల క‌థ‌. సంతోషం,నిరాశ‌, నిస్పృహ‌,కోరిక‌ల మ‌ధ్య జీవించే న‌లుగురు యువ‌తుల క‌థ అని తెలిసేలా ఉంది ఈ ట్రైల‌ర్‌. గుజ‌రాత్‌లోని ఉజాస్ అనే కుగ్రామం బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ చిత్రంలో వైవాహిక అత్యాచారం, బాల్య‌వివాహం, లింగ‌వివ‌క్ష వంటి సామాజిక అంశాల‌ను హైలైట్ చేశారు. మామూలుగా మనం ఊహించని కోణం లో ఉండే కొన్ని సామాజిక పరిస్థితుల మీద తిరగబడే అమ్మాయిల కథే ఈ సినిమా...

  English summary
  Radhika Apte recalls that an actor in the South film industry called her on phone and invited her to his room. She was very rude to him and had to face his anger during the rest of the shoot. She didn't reveal who he is.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X