లండన్ పోరగాడితో ‘రక్త చరిత్ర’ హీరోయిన్ పెళ్లి
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర సినిమాలో పరిటాల రవి పాత్రధారి వివేక్ ఒబెరాయ్ సరసన నటించిన బాలీవుడ్ భామ రాధిక ఆప్టే త్వరలో లండన్ పోరగాడిని పెళ్లి చేసుకోబోతోంది. అతని పేరు బెనడిక్ట్ టేలర్. లండన్ బేస్డ్ మ్యూజీషియన్.
రాధిక ఆప్టే లండన్లో చదువుకోవడంతో అప్పటి నుంచే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. కొంతకాలంగా వీరు డేటింగ్ చేస్తున్నారు. తాజాగా రాధిక ఆప్టే తరుపు పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లికి రంగం సిద్దమైంది. ఇప్పటికే ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగి పోయింది. త్వరలో పెళ్లి తేదీ ప్రకటించనున్నారు.
రక్తచరిత్ర చిత్రంలో పరిటాల రవి సతీమణి పరిటాల సునీత పాత్రలో రాధిక ఆప్టే అద్భుతంగా, సహజ సిద్ధంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన 'దోని' చిత్రంలో కూడా రాధిక తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె పలు తమిళ చిత్రాల్లో పాటు, ఓ మరాఠీ చిత్రంలో నటిస్తోంది. 'కరికలన్' మరియు 'వెట్రి సెల్వన్' అనే రెండు తమిళ చిత్రాలు త్వరలో విడుదలకానున్నాయి.
వీరి పెళ్లి భారతీయ సంప్రదాయం ప్రకారం జరుగనుందని తెలుస్తోంది. బెనడిక్ట్ టేలర్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఇండియాకు వచ్చి రాధిక కుటుంబం ఇచ్చే ఆతిథ్యం స్వీకరించనున్నారి సమాచారం. ఈ మేరకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











