భర్తతో కలిసి ఫోజులిచ్చిన 'లయిన్' హీరోయిన్
హైదరాబాద్ : బాలకృష్ణ సరసన 'లయిన్' చిత్రంలో నటించిన రాధికా ఆప్టే ...తన భర్తతో కలిసి హిమాలయాలకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలియచేసారు. అదేంటి ...ఆమెకు పెళ్లైందా అని ఆశ్చర్యపోకండి. ఆమె మూడేళ్ల క్రితమే ..బ్రిటీష్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్ ని ప్రేమించి,పెళ్లి చేసుకున్నారు.
అప్పుడప్పుడూ రాధిక ఆప్టే నటించే చిత్రాల లొకేషన్ కు కూడా ఆయన వస్తూంటారు. ఇక ఈ మధ్యన అర్దనగ్నంగా నటించిందంటూ వార్తలు రావటం, ఎక్కడకి వెళ్లినా వాటి గురించే మాట్లాడటంతో విసిగిపోయిన రాధిక ...ఇలా మంచు కొండల ప్రయాణం పెట్టుకుంది. ఈమె ట్వీట్ చేస్తూ... మంచు కొండలకు వెళ్లటం భలే ఆనందంగా ఉంది. కొండలంటే నాకు చాలా ఇష్టం మంటూ ట్వీట్ చేసింది. ఆమె చేసిన ట్వీట్ ని ఆమె భర్త ఫొటోతో కలిసి చూడండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
‘రక్త చరిత్ర', ‘షోర్ ఇన్ ది సిటీ' మరియు ‘ధోని' చిత్రాలలో తన నటనతో ఆకట్టుకున్న అందాల భామ రాధికా ఆప్టే. రాధికా ఆప్టే లండన్ కి చెందిన మేరీ బెనెడిక్ట్ టేలర్ అనే మ్యుజీషియన్ పెళ్లి చేసుకోబోతున్నారు. తన చదువు కోసం లండన్ వెళ్ళిన రాధికా అక్కడ పరిచయమైన మేరీ బెనెడిక్ట్ టేలర్ తో ప్రేమలో పడ్డారు.
ఈ విషయాన్ని రాధిక తన తల్లి తండ్రులకు చెప్పి ఒప్పించారు. రాధికా బెనెడిక్ట్ టేలర్ లకు నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది కానీ పెళ్లి తేదీ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రాధికా ఆప్టే ‘కరికలన్' మరియు ‘వెట్రి సెల్వన్' అనే రెండు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు.
న్యూడ్ వీడియో విషయానికి వస్తే...
రాధికా ఆప్టే న్యూడ్ వీడియో వాట్సప్‌లో చక్కర్లు కొడుతోందని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ముంబై పోలీసులను ఆశ్రయించాడు. తాను దర్శకత్వం వహించిన సినిమాలో రాధికా ఆప్టే నగ్నంగా నటించిన వీడియోని లీక్ చేశా రంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాట్సప్ లో వీడియో చక్కర్లు కొడుతోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మధ్యనే రాధికా ఆప్టే బాత్రూం సన్నివేశాలు ఇం టర్నెట్‌లో హల్‌చల్ చేయగా, అందులో ఉన్నది తాను కాదని, మార్ఫింగ్ చేశారని వివ రణ ఇచ్చిన సంగతి తెలిసింది. తాజా వీడియో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 20 నిమిషాల నిడివిగల షార్‌ట ఫిల్‌మ లోనివని ఆయన తెలిపారు.
ఇక ఈ టూర్ విషయమై రాధికా ఆప్టే చెప్తున్న వెర్షన్ వేరేగా ఉంది..
ప్రస్తుతం బొంబారియా అనే ఓ ఇంగ్లీష్ చిత్రంలో నటిస్తున్న రాధిక... ఉన్నట్లుండి షూటింగ్ నుంచి లీవ్ తీసుకుని హిమాలయాలకు చెక్కేసిందట. అదేంటి నిండా 30 ఏళ్లయినా నిండని ఈ భామకు హిమాలయాలకు వెళ్లింది వైరాగ్యంతో కాదు విసుగెత్తి కాదు..... తనలోని సాహసనారిని నిద్రలేపేందుకుని చెప్తోంది.
అంతేకాదు తనకు చిన్నతనం నుంచే సాహస క్రీడలంటే విపరీతమైన ఇష్టమట. అందుకే వీలుచిక్కినప్పుడల్లా కొత్త కొత్త ప్రదేశాలను చుట్టేస్తూ ఉంటుంది అమ్మడు... ఇప్పుడు కూడా ఈ జిజ్ఞాసతోనే ట్రెక్కింగ్ చేసేందుకు హిమాలయాలకు చేరుకుందట అమ్మడు
మైఖెల్ వార్డ్ అనే బ్రిటీష్ నిర్మాత రూపొందిస్తున్నబొంబారియా చిత్రంలో నటిస్తున్న రాధిక... కాస్తంత ఖాళీ చిక్కగానే ఇలా ట్రెక్కింగ్ బాట పట్టింది. ఇటీవలే అనురాగ్ కశ్యప్ చిత్రం నుంచి అమ్మడి న్యూడ్ వీడియో విడుదలై సంచలనం సృష్టించగా ఈ హైప్ తో ఆఫర్స్ మరింత పుంజుకున్నాయి.


Click it and Unblock the Notifications











