»   » సెక్స్ సీన్: హీరోయిన్‌కు హీరో సారీ చెప్పాడు, ఏం జరిగింది?

సెక్స్ సీన్: హీరోయిన్‌కు హీరో సారీ చెప్పాడు, ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ రాధిక ఆప్టే... ఆమె చేసేది తక్కువ సినిమాలే అయినా పలు వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఆమె నటించిన పార్చ్‌డ్ మూవీలోని న్యూడ్ సెక్స్ సీన్ సినిమా రిలీజ్ ముందే లీక్ అవ్వడం, పబ్లిసిటీ కోసమే దాన్ని లీక్ చేసారని తర్వాత మీడియాలో వివాదం రేగడం తెలిసిందే.

అయితే ఎన్ని వివాదాలు వచ్చినా రాధిక ఆప్టే మాత్రం సినిమా రిలీజ్ వరకు మౌనంగానే ఉంటూ వచ్చారు. రిలీజ్ కు కొన్ని రోజుల ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..... అది ఎలా లీక్ అయిందో తెలియదు, అది సినిమాలోనీ సీనే, స్క్రిప్టు డిమాండ్ చేసింది కాబట్టే ఆ సీన్ ఒప్పుకున్నాను. లీక్ వ్యవహారాన్ని తానేమీ పట్టించుకోవడం లేదని తెలిపారు.

ఆ సీన్ జీవితంలో మరిచిపోలేను

ఆ సీన్ జీవితంలో మరిచిపోలేను

తాజాగా మరో సందర్భంలో రాధిక ఆప్టే పార్చ్‌డ్ మూవీలోని సెక్స్ సీన్ చిత్రీకరణ సమయంలో జరిగిన విషయాలను గర్తు చేసుకున్నారు. ఈ సినిమా గురించి గానీ, ఇందులో చేసిన సెక్స్ సీన్ గురించి గానీ ఎప్పటికీ మరిచిపోలేనన్నారు.

రాధిక ఆప్టేకు సారీ చెప్పిన హీరో

రాధిక ఆప్టేకు సారీ చెప్పిన హీరో

ఈ సీన్లో తనతో పాటు నటించిన ఆదిల్ హుస్సేన్ సెక్స్ సీన్ షూటింగ్‌లో బాగా జోకులేసాడని, అంతా బాగా నవ్వుకున్నామని తెలిపారు. సీన్ ముగిసిన తర్వాత సారీ చెప్పాడని, చిత్రీకరణ సమయంలో తన వ్యవహార శైలి ఓవర్ చేసిన నట్లు అనిపించినా.. అనిపించిక పోయినా ఐయామ్ సారీ అనేసాడని రాధిక ఆప్టే తెలిపారు.

ఆ సీన్లతో పోర్న్ సీడీలు

ఆ సీన్లతో పోర్న్ సీడీలు

ఈ సెక్స్ సీన్ లీక్ కావడంతో కొందరు వాటిని సీడీల రూపంలోకి మార్చి, ఇతర సినిమాల్లో ఇలాంటి సీన్లు కలిపి పోర్న్ సినిమాల ప్యాకేజీ కింద ఈ సినిమాను జతచేసి అమ్మేయడం అప్పట్లో హాట్ టాపిక్ యింది. పైరసీ విషయం తెలియడంతో నిర్మాతల లబోదిబోమన్నారు. సెన్సార్ చేయని హై క్వాలిటీ మూవీ కేవలం రూ. 90 కే మార్కెట్లో లభ్యమవుతుండటం నిర్మాతలను కలవరానికి గురి చేసింది. సినిమా విడుదలైన తర్వాత ఆ ప్రభావం సినిమాపై కలెక్షన్లు బాగా తగ్గాయి.

రాధిక-ఆదిల్

రాధిక-ఆదిల్

సినిమాలో తాము ఇద్దరం కలిసి శృంగార సన్నివేశాల్లో నటించింది నిజమే, అలాంటి సీన్లు చేసినందుకు సిగ్గుపడటం లేదు, ఎందుకంటే అది నటనలో భాగం అని ఇటీవల ఆదిల్ హుస్సేన్ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

పర్చేడ్ మూవీ కథ

పర్చేడ్ మూవీ కథ

గుజరాత్ ప్రాంత నేపథ్యంతో సాగే నలుగురు సాధారణ మహిళలకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. రాణి, లజ్జో, బిజిలి, జానకి చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. సెప్టెంబర్ 23న సినిమా రిలీజయింది.

నటీనటులు

నటీనటులు

ఈ సినిమాలో రాధిక ఆప్టే, ఆదిల్ హుస్సేన్, సుర్వీన్ చావ్లా, తనిష్ఠా చటర్జీ, సయానీ గుప్తా నటించారు. పలు ఫల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే థియేటర్లో విడుదలైన తర్వాత సినిమాకు అనుకున్న కలెక్షన్లు మాత్రం రాలేదు.

English summary
Radhika Apte has never been known to mince words and she has proved it time and again, whether it be regarding her casting couch experience or her controversial sex scene in her latest release, ‘Parched’.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu