Don't Miss!
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
పరిటాల సునీత పాత్రలో రాధికా ఆప్టే
రామ్ గోపాల్ వర్మ "రక్త చరిత్ర"లో పరిటాల సునీత పాత్రకు కొత్త నటి రాధికా ఆప్టే ఎంపికయ్యారు. పరిటాల రవి జీవిత చరిత్రను వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వివేక్ ఓబెరాయ్ (పరిటాల రవి)సరసన నటించే అదృష్టం రాధికా ఆప్టే కు దక్కింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల సునీత వీడియోలు చూసి ఆమె బాడీ లాంగ్వేజ్ ని తెలుసుకోమని వర్మ రాధికకు చెప్పారు. రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్షనిస్టులను తప్పుడుగా చిత్రీకరిస్తున్నారని తెలుసుకున్న ఫ్యాక్షనిస్టులు ఆయనకు హెచ్చరికలు చేశారు. అందువల్ల ఈ సినిమా షూటీంగ్ స్పాట్ ల వద్ద సుశిక్షితులైన ప్రైవేట్ ఆర్మీ సేవలను తీసుకుంటున్నారు.
యదార్ధ వ్యక్తులు, యదార్ధ సంఘటనలతో ప్రభావితమైన కల్పిత కథగా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు వర్మ చెప్పారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సత్య, కంపెనీ వంటి చిత్రాల్లో లాగానే రక్త చరిత్రలో కూడా ఎవరు హీరో, ఎవరు విలనో చెప్పలేమని వర్మ అంటున్నారు.