నీ లోదుస్తులు కనిపిస్తున్నాయి అన్నాడు.. ఆ రోజులు పోయాయి: నటి హాట్ కామెంట్స్
కాలం వేగంగా పయనిస్తోంది. టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ జనం ముందుకెళ్తున్నారు. ఈ రోజుల్లో ఎవరికీ నచ్చిన దుస్తులు ఎవరు ధరిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఈ ఫ్యాషన్ యుగంలో దుస్తుల విషయంలో స్వేచ్ఛగా ఉంటున్నారంతా. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలు ధరించే దుస్తుల గురించి హాట్ కామెంట్స్ చేసింది నటి రాధికా మదన్. వివరాల్లోకి పోతే..

నేటి యువత తీరు.. ఫ్యాషన్ యుగం
ఆడపిల్లల దుస్తుల విషయంలో ఎన్నో ఆంక్షలు ఉంటాయి. కానీ నేటిరోజుల్లో వాటిని పట్టించుకోకుండా ఫ్యాషన్ దుస్తులు ధరిస్తూ చాలా వేగంగా వెళ్తున్నారు నేటితరం అమ్మాయిలు. కాకపోతే ఇదో పెద్ద పాపంలా చూస్తోంది నేటి సమాజం. అయినప్పటికీ తమకు నచ్చిన దుస్తులు దరిస్తామని అంటోంది నేటి యువత.

ఫ్యాషన్ యుగానికి సపోర్ట్.. మహిళా దినోత్సవం
ప్రముఖ నటి రాధికా మదన్ కూడా ఈ ఫ్యాషన్ యుగానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతోంది. ప్రస్తుతం ఆమె లోదస్తులకు సంబంధించిన ఓ క్యాంపెయిన్కు సపోర్ట్ చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతున్న సందర్భంగా ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాధికా మదన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పింది.

2020లో ఉన్నాం.. ఆ రోజులు పోయాయి
''మనం 2020 లో ఉన్నాం. ప్రతీ విషయంలో మహిళలు ప్రశంసలు అందుకుంటున్న రోజులివి. కానీ ఏ మహిళలనైతే పొడుగుతున్నారో అదే మహిళ లోదుస్తులు బయటికి కనిపించేలా వేసుకుంటే నోటికొచ్చిన కామెంట్స్ చేస్తుండటం ఇబ్బందికరంగా ఉంది. మహిళలు వేసుకునే దుస్తులను బట్టి వారి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే రోజులు పోయాయి. వాళ్లు ఎలాంటి దుస్తుల్లో సౌకర్యంగా ఫీలవుతారో అలాంటి దుస్తులనే వేసుకోనివ్వాలి'' అంటోంది నటి రాధికా మదన్.
ఈ మేరకు తన గతంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిపింది రాధికా. ''ఓసారి నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఓ అబ్బాయి నా దగ్గరికి వచ్చి నీ లోదుస్తులు కనిపిస్తున్నాయి అని చెప్పాడు. అది పెద్ద పాపం అనుకుని నేను సిగ్గుతో ఇంటికి వెళ్లిపోయాను. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి కనిపిస్తే నీ పని నువ్వు చూసుకోరా అని చెప్పాలని ఉంది'' అని పేర్కొంది రాధికా మదన్.

లోదుస్తులు బయటపడితే సిగ్గుపడకండి
ఇక తాను అందరు ఆడపిల్లలకు ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నానని చెప్పిన ఆమె.. మీ లోదుస్తులు బయటపడితే వాటిని చూసి సిగ్గుపడకండి. అది కేవలం మీ మానాన్ని కాపాడుకోవడానికి వేసుకునే దుస్తులే తప్ప మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించేవి కావని తెలిపింది.


Click it and Unblock the Notifications











