క్షవరం చేసుకునే మగాళ్లనే ఆమె..
శుభ్రంగా క్షవరం చేసుకునే వారిని యువతులు 50 శాతం ఇష్టపడతారని ,తాను కూడా అంతేనని కన్నడ నటి రాధికా పండిట్ తెలిపారు. అలాగే పురుషుల్లో అందంతో పాటు కొన్ని మంచి లక్షణాలు ఉండాలని ఆమె అన్నారు. జిల్లెట్ కొత్త ప్యాకేజ్ 'ప్రత్యేక సోల్జర్ రేంజ్"ను ఆమె బెంగుళూరు ఆవిష్కరిస్తూ ఇలా స్పందించారు. అలాగే అమ్మాయిలు అందంతో పాటు ధైర్యం, విశ్వాసం, అందం, సమగ్రత...తదితర లక్షణాలు కలిగిన పురుషుడినే తన జోడిగా కోరుకుంటారని అన్నారు. ఇలాంటి లక్షణాలు కలిగిన వారు సైనికులేనంటూ... నీల్సన్ ఇండియా నిర్వహించిన సర్వేలో బెంగళూరు పురుషులు, మహిళల్లో అత్యధికులు వారికి ఓటు వేయడాన్ని ఆమె ప్రస్తావించారు.
ఇక ఆమెతో పాటు ఈ పంక్షన్ లో పాల్గొన్న బాలీవుడ్ తార మలైకా అరోరా మాట్లాడుతూ...నేను కోరుకునే మగాడు అన్నీ సద్గుణాలే కలిగి ఉండాలి. అయినా ఈ రోజుల్లో అలాంటి పురుష పుంగవుడు దొరకడం కష్టమే అన్నారు.ఇక సైనికుడు భయం లేకుండా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటాడని చెప్పారు. దేశంతో పాటు మనల్నీ కాపాడతారని అన్నారు. చూడడానికి అందగాడు, డబ్బున్న వాడిని ఎంచుకునే కాలం పోయిందన్నారు. మొత్తానికి ప్రతి పురుషుడు తన కుటుంబానికి సైనికుడుగా ఉండాలని పేర్కొన్నారు. అలా సైనికుడుగా వ్యవహరించే వ్యక్తినే తాను ఇష్టపడతానని వెల్లడించారు.


Click it and Unblock the Notifications












