ఒకనాటి హీరోయిన్, ఇప్పటి మీడియా వ్యాపారవేత్త రాధిక ఎన్నోసార్లు చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తారు. తమిళనాడులో రాధికది కూడా రాజకీయ కుటుంబమే. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె ఆయన ముఖ్యమంత్రి కావాలని పదే పదే కోరుకుంటున్నారు. సినిమాల్లో కొత్తదనం తెచ్చిన చిరంజీవి రాజకీయాల్లో కూడా కొత్తదనం తీసుకువస్తారని ఆమె ఆశిస్తోంది. ముఖ్యమంత్రిగా ఆయన బాగా చేస్తారని ఆమె నిన్న వ్యాఖ్యానించారు. అనేక సూపర్ హిట్ సినిమాల్లో చిరంజీవి సరసన రాధిక హీరోయిన్ గా నటించారు. నిన్న తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత రాధిక చిరంజీవిపై మళ్ళీ తన ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు.