»   » లవ్: క్రికెటర్ అభిమన్యుతో రాధిక కూతురు ఎంగేజ్మెంట్ (ఫోటోస్)

లవ్: క్రికెటర్ అభిమన్యుతో రాధిక కూతురు ఎంగేజ్మెంట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా నటి రాధిక కూతురు రయానే వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు (సెప్టెంబర్ 23) నిశ్చితార్థం జరిగింది. క్రికెటర్ అభిమన్యు మిథున్‌తో ఆమె గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో ఇద్దరికీ ఈ రోజు నిశ్చితార్తం జరిగింది.

ఐపీఎల్ మ్యాచుల్లో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ తరుపున ఆడిన అభిమన్యు మిథున్‌కు, రయానేకు మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో విషయం ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించారు. పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహానికి మార్గం సుగమం అయింది. చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది.

రాధికకు తన రెండో భర్త, బ్రిటిషర్ అయిన రిచర్డ్ హార్డీ ద్వారా రయానె జన్మించింది. అతనితో విడిపోయిన తర్వాత రాధిక శరత్ కుమార్‌ను మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లో గ్రాజ్యుయేసన్ పూర్తి చేసిన రయానె ప్రస్తుతం రాధికకు చెందిన రాడాన్ మీడియా వ్యవహారాలు చూసుకుంటోంది. స్లైడ్ షోలో నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు..

రయానె
  

రయానె

రయానె నిశ్చితార్థం క్రికెటర్ అభిమన్యు మిథున్ తో జరుగుతున్న దృశ్యం.

పూల మాల
  

పూల మాల

నిశ్చితార్థం సందర్భంగా ఒకరికొకరు పూలమాల వేసుకుంటున్న దృశ్యం.

ప్రేమ వివాహం
  

ప్రేమ వివాహం

రయానె, అభిమన్యు మిథున్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

వియ్యం
  

వియ్యం

రయానె తల్లిదండ్రులు, అభిమన్యు మిథున్ తల్లిదండ్రుల వియ్యం.

ఫ్యామిలీ
  

ఫ్యామిలీ

రయానె, అభిమన్యు మిథున్ ఫ్యామిలీ పిక్చర్.

Please Wait while comments are loading...