చిరంజీవికి 24 సార్లు చెంపదెబ్బ.. మెగాస్టార్‌ను అలా కొట్టిన హీరోయిన్ ఎవరంటే..

మెగాస్టార్ చిరంజీవికి తనతో నటించిన అత్యంత ఇష్టమైన హీరోయిన్లలో రాధిక ఒకరు. సుమారు 40 ఏళ్ల క్రితం మొదలైన వారి పరిచయం ఇప్పటికే అంతే బలంగా ఉందనేది పలు సందర్బాల్లో వ్యక్తమైంది. సందర్భం దొరికినప్పుడల్లా వారిద్దరూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకొంటారు. అయితే ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని, వారి మధ్య జరిగిన తమాషా సంఘటనలను పంచుకొన్నారు. రాధిక చెప్పిన విషయాలు ఏమిటంటే..

చిరంజీవితో సినీ కెరీర్

చిరంజీవితో సినీ కెరీర్

చిరంజీవితోనే నా సినీ కెరీర్ మొదలైంది. న్యాయం కావాలి అనే నా తొలి తెలుగు సినిమా హీరో ఆయనే. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాం. మా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. అభిలాష, ఆరాధన, ఇది పెళ్లంటారా?, కిరాయి రౌడీలు చిత్రాల్లో మా జంటకు మంచి ప్రేక్షకాదరణ లభించింది అని రాధిక చెప్పుకొచ్చారు.

 షూట్‌లో మొదటి రోజు నుంచే

షూట్‌లో మొదటి రోజు నుంచే

న్యాయం కావాలి షూటింగ్‌లో మా కలిసిన మొదటి రోజు నుంచే మా మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మా మధ్య అన్యోన్యతను చూసి అనేక రూమర్లు వచ్చాయి. కానీ మధ్య అలాంటి బంధం లేదు. ఇప్పటికీ మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని రాధిక రూమర్లపై క్లారిటీ ఇచ్చారు.

చెంపదెబ్బ కొట్టే సీన్‌లో

చెంపదెబ్బ కొట్టే సీన్‌లో

న్యాయం కావాలి సినిమా షూట్‌లో జరిగిన ఓ సంఘటనను రాధిక గుర్తు చేసుకొన్నారు. ఓ సీన్‌లో చిరంజీవిని చెంపపై కొట్టాలి. ఆ సీన్‌లో నేను సరిగా చేయలేకపోయాను. తొలి సినిమా కావడంతో కొంత బెరుకుగా ఉంది. ఆ సీన్‌లో 24 సార్లు టేకులు తిన్నాను. అంటే నేను చిరంజీవిని 24 సార్లు చెంపదెబ్బ కొట్టాను అని రాధిక చెప్పారు.

Recommended Video

Trisha Walks Out Of Chiranjeevi’s ‘Acharya’ Movie
 క్షమాపణ అడిగితే..

క్షమాపణ అడిగితే..

అలా ఒకే సీన్‌లో చిరంజీవిని 24 సార్లు చెంప దెబ్బ కొట్టడంతో సాయంత్రం వరకు ఆయన చెంప బాగా కందిపోయింది. చెంప ఎర్రగా ఉబ్బిపోయింది. దాంతో నేను వెళ్లి ఆయనను క్షమాపణ కోరాను. అందుకు ఫర్వాలేదు అమ్మా.. నా చెంపను బాగానే వాయించావమ్మా.. అంటూ నవ్వుతూనే ఆ సంఘటనను సరదాగా తీసుకొన్నారు. చాలా సమయాల్లో చిరంజీవి అందించిన సహకారం మరువలేనిది అని రాధిక వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X