ఆ సినిమా సంక్రాంతికి లభించిన గిఫ్ట్ గా భావిస్తున్నా..
'రగడ" చిత్రంలో తను పోషించిన 'అష్టలక్ష్మీ" పాత్ర నటిగా పూర్తి సంతృప్తినిచ్చిందని, పాత్ర పరంగా అష్టలక్ష్మీగా చేసిన ఓవరాక్షన్ వర్కవుట్ అయ్యిందని ఆనందంగా చెప్పారు ప్రియమణి. అక్కినేని నాగార్జున హీరోగా వీరు పోట్ల దర్శకత్వంలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన 'రగడ" చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో అనుష్కతో పాటు మరో కథానాయికగా నటించిన ప్రియమణి శుక్రవారం విలేకరులతో ముచ్చటిస్తూ '' 'రగడ" విజయం కిస్మస్, న్యూఇయర్, సంక్రాంతిలకు లభించిన గిఫ్ట్‌గా భావిస్తున్నాను. నా పాత్ర బాగుందని అందరూ ప్రశంసిస్తుంటే సంతోషంగా వుంది. 'కింగ్"లో ఓ పాటలో నాగ్ సరసన చేసిన నేను 'రగడ"లో ఆయనతో పూర్తి నిడివి గల పాత్రలో నటించినందుకు హ్యాపీగా వుంది.
ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విసూ వుండే నాగ్‌తో చేయడం ఎంతో కంఫర్టబుల్‌గా అనిపించింది. ఈ సంక్రాంతికి అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని ఎంటర్‌టైనర్ చిత్రమిది"" అన్నారు. ప్రత్యేకంగా తన విషయంలో సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటూ ఏమీ వుండవని, కాకపోతే ప్రతి సంక్రాంతికీ తన కెరీర్‌లో ఆనందాలు వెల్లివిరుస్తాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ప్రియమణి.


Click it and Unblock the Notifications











