»   » చెన్నై వరదలు: కోటి విరాళం ప్రకటించిన ఆ స్టార్ ఎవరో తెలుసా?

చెన్నై వరదలు: కోటి విరాళం ప్రకటించిన ఆ స్టార్ ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇక చెన్నై నగరం భారీ వర్షాలు వరదలతో భారీగా నష్టపోయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చెన్నై కాలనీలన్నీ నీటితో నిండిపోవడంతో రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మంచినీరు, ఆహారం కోసం పజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో పలువురు స్వచ్చంద సంస్థలు రంగంలోకి దిగి సేవలు అందిస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ నుండి సినీ ప్రముఖులు ఇప్పటికే వరద బాధితుల సహాయార్థం విరాళాలు ప్రకటించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ చెన్నై వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. సినీ సెలబ్రిటీలు ఇచ్చిన విరాళాల్లో ఇదే అతి పెద్ద మొత్తం.

Raghava Lawrence 1 crore donation chennai rains floods

చెన్నై: వందల కోట్లున్న స్టార్లు లక్షలు బిచ్చమేస్తున్నారు!

అల్లు అర్జున్ 25 లక్షలు

అల్లు అర్జున్ 25 లక్షలు

‘చెన్నై వరద బాధితులకు రూ. 25 లక్షల విరాళం అందించాలని నిర్ణయించుకున్నాను. నేను నా తొలి 18 ఏళ్ల జీవితం అక్కడే గడిపాను. నన్ను ఇపుడు మీ ముందు హీరోగా నిలబెట్టిన నగరం. ఐలవ్ యూ చెన్నై అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసారు.

రజనీకాంత్ 10 లక్షలు

రజనీకాంత్ 10 లక్షలు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు వరద బాధితుల కోసం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.

మహేష్ బాబు 10 లక్షలు

మహేష్ బాబు 10 లక్షలు

మహేష్ బాబు మాట్లాడుతూ...భారీ వర్షాలు, వరదల వల్ల ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న చెన్నై ప్రజానీకం ఈ విపత్కర పరిస్తితి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నా వంతు సహాయంగా రూ. 10 లక్షలు సిఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాను అన్నారు.

ఎన్టీఆర్ 10 లక్షలు, కళ్యాణ్ రామ్ 5 లక్షలు

ఎన్టీఆర్ 10 లక్షలు, కళ్యాణ్ రామ్ 5 లక్షలు

"చెన్నైతో మాకు ఉన్న అనుబంధం మరువలేనిది. అటువంటి మహానగరం నుండి నేడు వస్తోన్న చిత్రాలను చూస్తోంటే చాలా బాధ గా ఉంది. ప్రజలు ధైర్యం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది. సహాయం అందించగలిగిన ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయం ఇది. మా తరపున ఆర్ధిక సహాయాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాం. చెన్నై త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం", అని ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తెలిపారు.

ప్రభాస్, కృష్ణం రాజు కలిపి 15 లక్షలు

ప్రభాస్, కృష్ణం రాజు కలిపి 15 లక్షలు

బాహుబలి స్టార్ ప్రభాస్, రెబల్ స్టార్ కృష్ణం రాజు కలిసి రూ. 15 లక్షల విరాళం ప్రకటించారు.

రవితేజ 5 లక్షలు

రవితేజ 5 లక్షలు

మాస్ మహరాజ్ రవితేజ చెన్నై వరద బాధితులకు రూ. 5 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్

యువ నటుడు వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నట్లు గా అయన తెలిపారు.

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ రూ. 3 లక్షల విరాళం ప్రకటించారు.

సంపూర్ణేష్

సంపూర్ణేష్

టాలీవుడ్ కామెడీ స్టార్ సంపూర్ణేష్ బాబు తన వంతుగా రూ. 50 వేలు విరాళం ప్రకటించారు.

English summary
Choreographer turned director turned actor Raghava Lawrence has once again surprised people with his magnanimous nature. The star of Muni series has donated 1 Cr to the Chennai rains relief fund.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu