»   » ‘భైరవ’ సినిమాకు 20 కోట్లు డిమాండ్ చేస్తున్న లారెన్స్

‘భైరవ’ సినిమాకు 20 కోట్లు డిమాండ్ చేస్తున్న లారెన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ సినిమాతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న దర్శకుడు లారెన్స్... ఆ తర్వాత ముని, కాంచన, గంగ లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరో కం దర్శకుడిగా దూసుకెలుతున్నాడు. ఇటీవల వచ్చిన ‘గంగ' చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు మంచి లాభాలు తెచ్చి పెట్టింది.

ముంని, కాంచన, గంగ సినిమాల సీరస్ లో లారెన్స్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. తమిళంలో ‘నాగ' పేరుతో విడుదల చేస్తున్న ఈ చిత్రానికి తెలుగులో ‘భైరవ' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఈ హారర్ కామోడీ సీరీస్ లో వచ్చిన తొలి 3 సినిమాలు హిట్ కావడంతో ‘భైరవ' చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

Raghava Lawrence Demands Rs 20 Crores for 'Bhairava'

తమిళంలో కాంచన-2 పేరుతో వచ్చిన సినిమాను తెలుగులో ‘గంగ'గా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ ‘గంగ'ను బెల్లంకొండ సురేష్ రూ. 16 కోట్లకు కొనుగోలు చేసి మంచి లాభాలు గడించారు. త్వరలో రాబోతున్న ‘నాగ' తెలుగు వెర్షన్ ‘భైరవ'కు లారెన్స్ రూ. 20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట.

అయితే తెలుగులో ఈ సారి ‘భైరవ' సినిమాను ఎవరు కొంటున్నారు? అంత పెద్ద మొత్తం పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? అనేది హాట్ టాపిక్ అయింది. బెల్లంకొండ సురేష్ మాత్రం ఈ సారి ఈ సినిమాను కొనే పరిస్థితిలో లేడని అంటున్నారు. మరి మరేదైనా పెద్ద బ్యానర్ ఈ సినిమాను కొనడానికి ముందుకు వస్తుందో? లేదో? చూడాలి.

English summary
Muni sequel Ganga that was acquired by Producer Bellam Konda Suresh for 16crores resulted in huge profits. Since the business doing well in Telugu, Lawrence now is demanding a mind blowing 20Crores for Bhairava.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu