twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారిని ఆదుకోవడం నా బాధ్యత.. సాయమందించిన లారెన్స్

    |

    రాఘవ లారెన్స్ హీరోగా సక్సెస్ అయినా, దర్శక నిర్మాతగా ఎన్ని సూపర్ హిట్స్ అందుకున్నా.. ఆయనకు గుర్తింపును తీసుకొచ్చింది డ్యాన్సే. ఆయన వేసే స్టెప్పులు, కంపోజ్ చేసిన సాంగ్స్ ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వంటి వారికి ప్రత్యేకమైన మ్యానరిజాలను క్రియేట్, కొత్త కొత్త స్టెప్పులను క్రియేట్ చేయడంలో లారెన్స్ దిట్టా. అయితే ప్రస్తుతం డైరెక్షన్, యాక్టింట్‌లో బిజీగా ఉండటంతో కొరియోగ్రఫీ చేయడం లేదు. అంత మాత్రాన డ్యాన్సర్ల యోగ క్షేమాలను పట్టించుకోవడం మానలేదు.

    కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలబడ్డాడు. సినీ పరిశ్రమలోని కార్మికులను, తన సొంతూరిలోని ప్రజలకు ఆర్థిక సాయాన్ని అందించాడు. కోలీవుడ్‌లో మరే హీరో చేయనంత సాయాన్ని, ఇవ్వనంత విరాళాన్నిఇచ్చాడు. మూడు కోట్ల విరాళాన్ని ఇచ్చాక కూడా.. ఇంకా తనకు తృప్తి రాలేదుని ఏదో చేయాలని ఈ డబ్బులు సరిపోవని తెగ ఎమోషనల్ అయ్యాడు.

    Raghava lawrence Help To Dancers In Corona Crisis

    ఎంతో మంది తనకు ఫోన్ చేసి సాయం అడుగుతున్నారని, అందరినీ ఆదుకోవాలనుకుంటున్నానని తెలిపాడు. తాజాగా ఉపాధి లేక సతమతమవుతున్న డ్యాన్సర్లకు లారెన్స్ అండగా నిలబడ్డాడు. 23 మంది డ్యాన్సర్లు (హైద్రాబాద్ 10, చెన్నై 13) నేరుగా వారి ఖాతాల్లోకి రూ. 25 వేల చొప్పున రూ. 5,75,000 జమ చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా డ్యాన్స్‌పై ఆధారపడిన వారిని ఆదుకోవడం తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు.

    English summary
    Raghava lawrence Help To Dancers In Corona Crisis. Lawrence deposited Rs 25,000 to each for 23 poor dancers (10 from Hyderabad, 13 from Chennai) directly to their bank accounts
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X