విడుదలకు ముందే కేక పెట్టించిన కాంచన 3.. తెలుగు రాష్ట్రాలలో ప్రీరిలీజ్ బిజినెస్!

రాఘవ లారెన్స్ స్వీయ దర్శత్వంలో తెరక్కుతున్న చిత్రం కాంచన 3. ముని సిరీస్ లో రాబోతున్న నాలుగవ చిత్రం ఇది. ఈ సిరీస్ వరుసగా విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే. హర్రర్ ఎలిమెంట్స్ తో థ్రిల్ చేస్తున్న లారెన్స్ విజయాలు అందుకుంటున్నాడు. వేదిక, ఓవియా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందిన కాంచన 3 ఏప్రిల్ 19 శుక్రవారం రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి అంచనాలతో విడుదలవుతున్న కాంచన 3 చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.

 భయపెట్టబోతున్న లారెన్స్

భయపెట్టబోతున్న లారెన్స్

ఇప్పటివరకు కాంచన సిరీస్ లో విడుదలైన చిత్రాలన్నీ విజయాలుగా నిలిచాయి. ప్రతి చిత్రంలో ఆకట్టుకునే హర్రర్ ఎలిమెంట్స్ తో లారెన్స్ ప్రేక్షకులని సర్ప్రైజ్ చేస్తున్నాడు. కాంచన 3లో కూడా లారెన్స్ మ్యాజిక్ చేస్తాడని ఆడియన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లారెన్స్ భయంకర రూపంలో కనిపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ ఓవియా, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 ప్రీరిలీజ్ బిజినెస్ అదుర్స్

ప్రీరిలీజ్ బిజినెస్ అదుర్స్

కాంచన 3పై నెలకొని ఉన్న అంచనాలతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర థియేట్రికల్ హక్కులకు భారీ ధర లభించింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఏరియాలలో ఈ చిత్రానికి 16 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. లారెన్స్ నటించిన చిత్రానికి ఇది మంచి ధర అని చెప్పొచ్చు. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు కాంచన 3 తెలుగు వర్షన్ ని 12 కోట్లకు కొనుక్కున్నారు. థియేట్రికల్ హక్కుల రూపంలో ఆయనకు 16 కోట్లు దక్కాయి. కాంచన సిరీస్ కు మాస్ ప్రేక్షకుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. దీనితో కాంచన 3కి కూడా ఓపెనింగ్స్ బావుంటాయని అంచనా వేస్తున్నారు.

కాంచన 2 ప్రభావం

కాంచన 2 ప్రభావం

లారెన్స్ ప్రముఖ పాత్రలో తాప్సి, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించిన కాంచన 2 చిత్రం 2015లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఈ ప్రభావం కూడా కాంచన 3 ప్రీరిలీజ్ బిజినెస్ పై బాగా పనిచేసింది. మంచి టాక్ వస్తే కాంచన 3 చిత్రం 16 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ప్రస్తుతం వేసవి సీజన్ కూడా ఈ చిత్రానికి కలసి రానుంది.

కాంచన సిరీస్ కొనసాగుతుంది

కాంచన సిరీస్ కొనసాగుతుంది

కాంచన సిరీస్ ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని లారెన్స్ ప్రకటించాడు. సన్ పిక్చర్స్, లారెన్స్ సంయుక్తంగా కాంచన 3ని నిర్మించారు. ఇటీవల ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. లారెన్స్ పెర్ఫామెన్స్, హర్రర్ అంశాలతో కూడిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక కోవైసరళ ఫన్నీ సన్నివేశాల కోసం కూడా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X