Chandramukhi2 Twitter Review రజినీకాంత్‌ను లారెన్స్ మరిపించాడా? జ్యోతికను కంగనా బీట్ చేసిందా?
రజినీకాంత్ నటించిన చంద్రముఖి ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వచ్చేసింది. రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ నటించిన చంద్రముఖి 2 ఈరోజు అనగా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రిమియర్స్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా రివ్యూను పోస్ట్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా హిట్ కొట్టిందా... రాఘవా లారెన్స్.. రజినీని మరిపించాడా... కంగనా జ్యోతికను బీట్ చేసిందా అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
2005 సంవత్సరంలో రజినీకాంత్, జ్యోతిక, నయనతార కలిసి నటించిన చిత్రం చంద్రముఖి. ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. ఆయన టేకింగ్, జ్యోతిక యాక్టింగ్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ వచ్చింది. ఇక ఈ సీక్వెల్ కి కూడా పి. వాసు దర్శకత్వం వహించారు. ఇక మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక చంద్రముఖి 2లో రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ నటించారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ఈ సినిమా ఈరోజు అనగా సెప్టెంబర్ 28న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. హిందీ బెల్టులో కంగనా వల్ల కాస్తా థియేటర్లు ఎక్కువగా దక్కగా... అలాగే తెలుగు, తమిళంలో కూడా భారీగా రిలీజ్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కీరవాణి ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
ఇక చంద్రముఖి2 రామ్ పోతినేని సినిమా స్కంద మూవీకి పోటీగా థియేటర్లకి వచ్చింది. ఇక ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ప్లస్ అవుతుందని ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు. పీ వాసు కథను నడిపించిన తీరు సినిమాకు పెద్ద ప్లస్ అంటున్నారు. హీరో రాఘవ లారెన్స్ రెండు భిన్నమైన పాత్రల్లో నటించారని... రజినీతో పోలిస్తే.. రాఘవ లారెన్స్ నటన తేలిపోయిందని కామెంట్స్ వస్తున్నాయి.
ఇక ప్రీమియర్స్ చూసిన నెటిజన్స్... ఫస్ట్ ఆఫ్ లో లారెన్స్ నటన ఫైర్ అంటున్నారు. ఇక ఫస్ట్ ఆఫ్ లో కంగనరనౌత్ ఎంటర్ అవ్వలేదట. ఎంఎం కీరవాణి సాంగ్స్ పర్వాలేదని అంటున్నారు. వడివేలు కామెడీ వర్కౌట్ అయింది. ఇక విజువల్స్ బాగున్నాయి. ఎమోషన్స్ కూడా వర్క్ అయినట్లు చెబుతున్నారు. ఇక నెమ్మదిగా సాగే కథనం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











