Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
ఆ భయంతోనే కాంచన 3 వందసార్లు చూశా.. 'జెర్సీ'లో జీవితం అంటే ఏంటో చెప్పారు.. లారెన్స్!
రాఘవ లారెన్స్ స్వీయ దర్శత్వంలో తెరక్కుతున్న చిత్రం కాంచన సిరీస్ విజయపథంలో దూసుకుపోతోంది. కాంచన 3 చిత్రం గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. కాంచన సిరీస్ తో హర్రర్ ఎలిమెంట్స్ తో థ్రిల్ చేస్తున్న లారెన్స్ విజయాలు అందుకుంటున్నాడు. వేదిక, ఓవియా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. తెలుగు, తమిళ రెండు భాషల్లో కాంచన 3 మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా కాంచన 3 సక్సెస్ మీట్ నిర్వహించారు.
100 సార్లు చూశా
సక్సెస్ మీట్ లో లారెన్స్ మాట్లాడుతూ.. కాంచన 3 చిత్రాన్ని ప్రేక్షకులంతా బ్లాక్ బస్టర్ చేశారని లారెన్స్ తెలిపాడు. మీరంతా ఈ చిత్రాన్ని ఒకసారో రెండు సార్లో చూసి ఉంటారు. కానీ తాను మాత్రం 100 సార్లు చూశానని లారెన్స్ తెలిపాడు. అందుకు గల కారణాన్ని కూడా లారెన్స్ వివరించాడు. మీకు నచ్చుతుందో లేదో అనే భయంతోనే సినిమాని అన్నిసార్లు చూశా. ఈ సన్నివేశం మీకు నచ్చుతుందా లేదా, భయాన్ని కలిగించే విధంగా ఉంటుందా లేదా అనే టెన్షన్ నాకు ఎప్పుడూ ఉంటుందని లారెన్స్ తెలిపాడు.
రెండేళ్ల పాటు
ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండాలని తామంతా రెండేళ్ల పాటు కాంచన 3 కోసం కష్టపడ్డాం అని లారెన్స్ తెలిపాడు. ఈ చిత్రాన్ని విడుదల చేసిన ఠాగూర్ మధు, బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నారని లారెన్స్ తెలిపాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి చాలా బాగా చేశారని, వారందరికీ ఇంకా మంచి చిత్రాల్లో అవకాశాలు రావాలని రాఘవేంద్ర స్వామిని ప్రార్థిస్తున్నట్లు లారెన్స్ తెలిపాడు. తమన్ ఈ చిత్రానికి అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడని లారెన్స్ తెలిపారు.
దూసుకుపోతున్న కాంచన 3
వాస్తవానికి కాంచన 3 చిత్రానికిసినీ విశ్లేషకుల నుంచి కాస్త నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ లారెన్స్ మ్యాజిక్ పనిచేస్తూ కాంచన 3 చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లోనే కాంచన 3 రెండు తెలుగురాష్ట్రాల్లో దాదాపు 9 కోట్ల షేర్ సాధించింది. వేసవి సెలవులు ఈ చిత్రానికి బాగా కలసి వస్తున్నాయి.
జెర్సీపై లారెన్స్ కామెంట్
మన సినిమా గురించి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం.. అది మామూలే.. రాత్రి జెర్సీ సినిమా చూశా. చాలా బావుంది. జెర్సీ దర్శకుడు, నాని అద్భుతంగా చేశారు. ఈ చిత్రంలో జీవితం అంటే ఏంటో చూపించారు అని లారెన్స్ నాని సినిమాపై ప్రశంసలు కురిపించాడు. కాంచన 3, జెర్సీ రెండు చిత్రాలని చూడాలని లారెన్స్ కోరాడు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి.