»   » రాఘవ లారెన్స్‌కు చిటికెలతో చిన్నారుల స్వాగతం (ఫోటోస్)

రాఘవ లారెన్స్‌కు చిటికెలతో చిన్నారుల స్వాగతం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ వీలు చూసుకుని సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకోవడం చేస్తుంటాడు. తాజాగా లారెన్స్.... చిన్నారుల కోరిక మేరకు స్కూల్ సందర్శించారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వారిని సంతోష పెట్టేందుకు సమయం కేటాయించారు.

తమ కోరిక మేరకు పాఠశాలకు వచ్చిన లారెన్స్ కు చిన్నారులంతా చిటికెలతో వెరైటీగా స్వాగతం పలకడం విశేషం. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ... చిన్నారులను సంతోష పెట్టేందుకు తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. సాయంత్రం వరకు వారితోనే గడిపి తిరిగి వెళ్లారు.

ప్రస్తుతం లారెన్స్ మొట్ట శివ, కెట్టా శివ అనే సినిమా చేస్తున్నారు. సాయి రమణి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిక్కి గల్ రాణి హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు భైరవ, ముని 4-నాగ, ఓరు టిక్కెట్ల రెండు సినిమా అనే సినిమాలు పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

చిటికెలతో స్వాగతం
  

చిటికెలతో స్వాగతం

రాఘవ లారెన్స్ కు చిటికెలతో స్వాగతం పలుకుతున్న చిన్నారులు.

చిన్నారులతో కలిసి..
  

చిన్నారులతో కలిసి..

తమిళనాడులోని పాఠశాలలో చిన్నారులతో కలిసి రాఘవ లారెన్స్.

లారెన్స్
  

లారెన్స్

పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో రాఘవ లారెన్స్..

అబ్దుల్ కలాం వేషధారణ
  

అబ్దుల్ కలాం వేషధారణ

అబ్దుల్ కలాం వేషధారణలో ప్రసంగం ఇచ్చిన చిన్నారిని ప్రశంసిస్తున్న లారెన్స్.

 

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu