చిరంజీవిగారితో చేయాలని.. ప్రెస్ మీట్‌లో రియల్ హీరో అనిపించుకున్న లారెన్స్!
Recommended Video

రాఘవ లారెన్స్ స్వీయ దర్శత్వంలో తెరక్కుతున్న చిత్రం కాంచన 3. ముని సిరీస్ లో రాబోతున్న నాలుగవ చిత్రం ఇది. ఈ సిరీస్ వరుసగా విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే. హర్రర్ ఎలిమెంట్స్ తో థ్రిల్ చేస్తున్న లారెన్స్ విజయాలు అందుకుంటున్నాడు. వేదిక, ఓవియా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న కాంచన 3ని ఏప్రిల్ 19న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.

కాంచనతో వచ్చిన ప్రతిసారి
లారెన్స్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న కాంచన సిరీస్ కు మంచి ఆదరణ లభిస్తోంది. లారెన్స్ కాంచనలో పొందుపరుస్తున్న హర్రర్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. దీనితో ఈ సిరీస్ లో వచ్చిన ప్రతి చిత్రం ఇప్పటివరకు మంచి విజయం సాధించింది. కాంచన 3 లో లారెన్స్ ఓల్డ్ మాన్ లుక్ లో కనిపిస్తున్నాడు. కాంచన 3 కూడా ప్రేక్షకుల మంచి అనుభూతి కలిగించేలా ఉంటుందని లారెన్స్ తెలిపాడు.

మంచి మెసేజ్
కాంచన సిరీస్ లో ప్రతి చిత్రంలో లారెన్స్ మంచి సందేశాన్ని జోడిస్తున్నాడు. కాంచన చిత్రంలో హిజ్రా, కాంచన 2లో అంగవైకల్యం ఉన్న పాత్రలు, అలాగే కాంచన 3 లో కూడా మంచి సందేశం ఉందని లారెన్స్ తెలిపాడు. కాంచన సిరీస్ ప్రారంభించినప్పుడు తాను సీక్వెల్ చేయాలనీ ప్లాన్ చేసుకోలేదని.. దేవుడి దయవలన అలా కలసి వస్తోందని లారెన్స్ తెలిపాడు.

ఓల్డ్ లుక్
ఈ చిత్రంలో తాను ఓల్డ్ లుక్ లో కనిపించడంపై లారెన్స్ స్పందించాడు. తన పాత్ర అందరికి నచ్చే విధంగా ఉంటుందని లారెన్స్ వివరించాడు. గత చిత్రాల్లో ఉన్న పాత్రలు ఈ చిత్రంలో కూడా ఉన్నాయి. నా తల్లిగా కోవైసరళగారే నటిస్తున్నారు. పాత్రలు మార్చాలని చూసినా ఆడియన్స్ ఒప్పుకోవడం లేదు. ఎక్కడకు వెళ్లినా కోవైసరళ గారు ఈ చిత్రంలో కూడా ఉన్నారా అని ప్రేక్షకులు అడుగుతున్నారు. వారి కోరిక మేరకు ఆ పాత్రని అలాగే కొనసాగిస్తున్నామని లారెన్స్ తెలిపాడు.

కొన్ని కథలు రాస్తున్నా
తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి కొన్ని కథలు రాస్తున్నట్లు లారెన్స్ తెలిపాడు. నాగార్జునగారితో మరోసారి చేయాలని, చిరంజీవిగారిని డైరెక్ట్ చేయాలని ఆశగా ఉన్నట్లు లారెన్స్ తెలిపాడు. తాను డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పటి నుంచి చిరంజీవి గారు ఎంకరేజ్ చేస్తున్నారు. నాగార్జున గారు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలుపుతున్నానని లారెన్స్ తెలిపాడు.

రియల్ హీరో
ఇదిలా ఉండగా కాంచన 3 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తన చారిటి గురించి ప్రస్తావించి మరోమారు తాను రియల్ హీరో అని అనిపించుకున్నాడు. లారెన్స్ తన చారిటి ద్వారా చిన్న పిల్లలకు ఓపెన్ హార్ట్ సర్జరీని ఉచితంగా చేయిస్తున్న సంగతి తెలిసిందే. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే చిన్నారులు ఎవరైనా ఉంటే తన చారిటికి తెలియజేయాలని లారెన్స్ కోరారు.


Click it and Unblock the Notifications











