పవన్ కళ్యాణ్ లతోనే నెక్ట్స్...ప్రస్తుతం స్క్రిప్టు టాక్స్
హైదరాబాద్ : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్క్రిప్ట్ టాక్ లో వున్నాను. ఒకసారి అన్నీ కుదిరాక మరిన్ని వివరాలు వెల్లడిస్తాను అంటున్నారు లారెన్స్. భయం, వినోదం మేళవింపుతో 'ముని' తీసి ప్రేక్షకులను మెప్పించారు లారెన్స్. వాటికి కొనసాగింపు చిత్రాలుగా వచ్చిన 'కాంచన', 'గంగ' కూడా మంచి ఆదరణ పొందాయి. ఆయన నటించి, దర్శకత్వం వహించిన 'గంగ' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడీ గంగ హిట్టవటంతో ఎక్కడెక్కడి ఆఫర్స్ ఆయన ముందు సాగిలపడుతున్నాయి. తాజాగా ఆయనకు రజనీకాంత్ నుంచి సైతం ఆఫర్ వచ్చినట్లు చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కు సైతం కథని రెడీ చేస్తున్నాని అన్నారు.
లారెన్స్ మాట్లాడుతూ....తెలుగులో ఈ మధ్య నృత్య దర్శకుడిగా సినిమాలు చేయలేదు. కథ నచ్చి మంచి అవకాశాలొస్తే తప్పనిసరిగా చేస్తా. చిరంజీవిగారి 150వ సినిమాకి తప్పనిసరిగా కొరియోగ్రఫీ చేస్తా. పవన్ కల్యాణ్‌ని నా దర్శకత్వంలో సరికొత్తగా చూపాలనుంది. అందుకు ఓ కథాంశం అనుకున్నాను. దానికి పూర్తి రూపం తెచ్చే పనిలో ఉన్నాను అని చెప్పారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అలాగే...ప్రేక్షకులు కోరే రకరకాల కొత్తదనంతో వినోదపరచడమే ధ్యేయంగా 'గంగ' మలిచా. నేనిందులో వేసిన ఐదు గెటప్పులు, నిత్య మేనన్ పాత్ర చిత్రణ ప్రేక్షకులకు నచ్చాయి. 'ముని', 'కాంచన'కి మించిన ప్రేక్షకాదరణ 'గంగ'కి లభిస్తోంది. రజనీకాంత్‌గారు సినిమా చూసి 'సినిమా చాలా బాగుంది. అన్ని గెటప్పులు నీకెలా సరిపోతున్నాయి'అని మెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఇద్దరం కలసి ఓ సినిమా చేద్దాం.. కథ సిద్ధం చేయమన్నారు అని ఆనందంతో చెప్పుకొచ్చారు.
అంతేకాదు...మంచి కథ, అవకాశాలొస్తే నాగార్జునగారితో మరో సినిమా చేయడానికి సిద్ధం. ఆయనతో 'మాస్', 'డాన్' చేసిన తర్వాత 'కాంచన'సినిమా గురించి ఆయనకు చెప్పా. మీరు అంగీకరిస్తే చేద్దామన్నా. 'చీర కట్టాలి, ముఖానికి పసుపు రాయాలంటున్నావ్' అబ్బే అని సంకోచించి... అది నీకే సరిపోతుంది నువ్యే చెయ్యి అన్నారు. ఇలాంటి కారణంతోనే హిందీ 'కాంచన' ప్రారంభం ఆలస్యమవుతోంది. త్వరలో ప్రారంభిస్తా అని అన్నారు.


Click it and Unblock the Notifications











