శ్రీకాళహస్తిలో రాఘవ లారెన్స్ రాహుకేతు పూజలు
దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మంగళవారం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు వీఐపీ దర్శనం కల్పించారు. లారెన్స్ తమిళనాడులో ఓ ఆలయం నిర్మిస్తున్నారని, అందులో భాగంగానే ఇక్కడ పూజలు నిర్వహించానికి వచ్చినట్లు తెలుస్తోంది.
లారెన్స్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'రెబెల్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతలతో పాటు ఈచిత్రానికి కొరియోగ్రఫీ, సంగీతం సమకూర్చే బాధ్యతలను కూడా లారెన్సే భుజాలపై వేసుకున్నాడు. తొలుత ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికైనప్పటికీ లారెన్స్ తీరు నచ్చకనే తమన్ తప్పుకున్నట్లు చర్చించుకుంటున్నారు. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్లు. ఈ వేసవిలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రానికి ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్, మాటలు: స్వామి, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్.


Click it and Unblock the Notifications











