twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    40 రోజులు అడవిలో ఎన్టీఆర్.. నా జీవితానికి ప్రాణం పోశారు!

    |

    టాలీవుడ్ దిగ్గజ దర్శకులలో రాఘవేంద్ర రావు ఒకరు. దశాబ్దాల పాటు కమర్షియల్ దర్శకుడిగా విజయాలు సాధించడం సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలకు రాఘవేంద్ర రావు మంచి విజయాలు అందించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాఘవేంద్ర రావు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని వివరించారు.

    ఈ స్థాయిలో ఉండడానికి కారణం

    ఈ స్థాయిలో ఉండడానికి కారణం

    తాను దర్శకుడిగా ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఎన్టీఆర్ అని రాఘవేంద్ర రావు అన్నారు. ఆయనతో తెరకెక్కించిన అడవి రాముడు చిత్రం ఇచ్చింది. అప్పటివరకు సాధారణమైన దర్శకుడిగా ఉన్న తనకు అడవిరాముడు చిత్రంతో మంచి అవకాశాలు వచ్చాయని రాఘవేంద్ర రావు అన్నారు.

    అసిస్టెంట్ డైరెక్టర్

    అసిస్టెంట్ డైరెక్టర్

    ఎన్టీఆర్ నటించిన పాండవ వనవాసం చిత్రానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఆ చిత్రంతోనే నా సినీరంగ ప్రయాణం మొదలైంది. ఎన్టీఆర్ పై ఆ చిత్రంలో క్లాప్ కొట్టా. ఆ తరువాత దర్శకుడిగా మారానని రాఘవేంద్ర రావు అన్నారు.

    యావరేజ్ చిత్రాలు

    యావరేజ్ చిత్రాలు

    అడవిరాముడు చిత్రం చేసే వరకు తాను దర్శత్వం వహించిన సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. అడవిరాముడు చిత్రం కోసం ఎన్టిఆర్ వద్దకు వెళితే నిర్మాతలు నా గురించి చెప్పారు. ఆ బ్రదర్ పై నాకు నమ్మకం ఉంది, బాగా చేస్తారు అని ఎన్టీఆర్ అన్న మాటలు నాకు ఇప్పటికి గుర్తున్నాయని రాఘవేంద్ర రావు అన్నారు.

     40 రోజులు అడవిలో ఎన్టీఆర్

    40 రోజులు అడవిలో ఎన్టీఆర్

    అడవిరాముడు చిత్రం షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ 40 రోజుల పాటు అడవిలోనే ఉన్నారు. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా సాహసాలు చేశారని రాఘవేంద్ర రావు తెలిపారు. తాను, దాసరి తెరకెక్కించిన చిత్రాలు తన రాజకీయ జీవితానికి ఎంతో ఉపయోగపడ్డాయని ఎన్టీఆర్ తరచుగా అంటుండేవారు అని రాఘవేంద్ర రావు తెలిపారు.

    English summary
    Raghavendra Rao about NTR's Adavi Ramudu movie. NTR stayed 40 days in forest for this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X