twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్న గారితో ప్రయాణం మరువలేనిది.. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను: రాఘవేంద్ర రావు

    |

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ దర్శకులు, ప్రస్తుతం టాలీవుడ్ సినీ రారాజు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన కొత్త సినిమాను ప్రకటించారు. ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తున్నా అంటూ ట్విట్టర్ వేదికగా రాఘవేంద్ర రావు మెసేజ్ పెట్టారు. ఆ విశేషాలేంటో చూద్దాం..

    ఎన్టీఆర్ జయంతి

    మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి నేడు (మే 28). ఈ సందర్బంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు ట్వీట్స్ పెడుతున్నారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ట్వీట్ చేస్తూ అన్న గారితో ఆయనకున్న అనుబంధాన్ని తెలిపారు.

    నా యాభై ఏళ్ళ సినీ జీవితంలో

    నా యాభై ఏళ్ళ సినీ జీవితంలో

    నా యాభై ఏళ్ళ సినీ జీవితంలో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో అని ట్వీట్ చేస్తూ జోహార్ ఎన్టీఆర్ అనే హాష్ ట్యాగ్ జత చేశారు రాఘవేంద్ర రావు.

     ముగ్గురు డైరెక్టర్లు.. ముగ్గురు హీరోయిన్లు

    ముగ్గురు డైరెక్టర్లు.. ముగ్గురు హీరోయిన్లు

    తన తదుపరి సినిమాను ప్రకటించిన దర్శకేంద్రుడు.. తన సినిమా కోసం ముగ్గురు డైరెక్టర్లు.. ముగ్గురు హీరోయిన్లు పని చేయబోతున్నారని తెలిపాడు. అంతేకాదు హీరో ఎవరంటూ డబుల్ క్వశ్చన్ మార్క్ పెట్టి ఆసక్తి రేకెత్తించారు రాఘవేంద్ర రావు. ఈ మేరకు ఎన్టీఆర్ కి పూలమాల వేస్తున్న పిక్ జత చేశారు.

    కెరీర్‌లో ప్రత్యేకం అని తెలపడంతో

    కెరీర్‌లో ప్రత్యేకం అని తెలపడంతో

    ముగ్గ‌రు ద‌ర్శ‌కులు, ముగ్గురు హీరోయిన్లు అని పేర్కొనడమే గాక తన కెరీర్‌లో ప్రత్యేకం అని తెలపడంతో సినిమా పట్ల ఆసక్తి నెలకొంది జనాల్లో. ఇంతకీ ఆ ముగ్గురు ద‌ర్శ‌కులు, ఆ ముగ్గురు క‌థానాయిక‌లు ఎవరు? వారితో నటించబోయే హీరో యంగ్ హీరోనా లేక సీనియర్ హీరోనా? అనేది తెలుసుకోవాలని ప్రేక్షకుల్లో కుతూహలం మొదలైంది. కె.రాఘ‌వేంద్ర‌రావు, శోభు యార్ల‌గ‌డ్డ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ని సమాచారం. చూడాలి మరి దర్శకేంద్రుడు త్వరలో చెప్పబోయే పూర్తి వివరాల్లో ఎవరెవరి పేర్లు ఉంటాయా? అనేది.

    English summary
    Kovelamudi Raghavendra Rao statement for his new movie. On the occasion of NTR 96th birth anniversary
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X