twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ట్రస్ట్... మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి భారీ విరాళం!

    |

    దర్శకేంద్రుడు, టాలీవుడ్ దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు దర్శకుల సంక్షేమం కోసం సరికొత్త ఆలోచన చేశారు. తెలుగు సినీ డైరెక్టర్స్ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. కష్టాల్లో ఉన్న పేద దర్శకులకు సహాయం అందించాలనే మంచి ఉద్దేశ్యంతో దీన్ని నెలకొల్పారు.

    తెలుగు చలన చిత్ర దర్శకుల దినోత్సవం (మే 4) రోజునే రాఘవేంద్రరావు టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం ట్రస్ట్ పెడుతున్నట్లు ప్రకటించారు. తెలుగు సినీ డైరెక్టర్స్ ట్రస్ట్ (టీఎఫ్‌డీటీ) పేరుతో జులై 24న దీన్ని రిజిస్టర్ చేయించారు.

     Raghavendra Rao, Chiranjeevi, Rajamouli donation for TFDT

    దీనికి కె. రాఘవేంద్రరావు చైర్మన్‌గా ఉండగా... మేనేజింగ్ ట్రస్టీగా ఎన్. శంకర్, ట్రస్టీలుగా వి.వి.వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నందిని రెడ్డి, రాంప్ర‌సాద్‌, కాశీ, బి.వి.ఎస్‌.ర‌వి, ట్రెజరర్ గా మెహర్ రమేశ్ వ్యవహరిస్తున్నారు.

    ఈ ట్రస్ట్‌ ప్రకటించిన సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి రూ. 25 లక్షలు విరాళం ఇవ్వగా, రాఘవేంద్రరావు రూ. 10 లక్షలు ఇచ్చారు. తాజాగా ఈ టస్టుకు తన వంతుగా రూ. 50 లక్షలు ప్రకటించారు బాహుబలి డైరెక్టర్ రాజమౌళి. ట్రస్టులో భారీ నిధి ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీ ద్వారా కష్టాల్లో ఉన్న దర్శకులకు సహాయం అందిస్తారని తెలుస్తోంది.

    English summary
    Raghavendra Rao, Chiranjeevi, Rajamouli donated to TFDT Rs 10 lakh and Rs 25 lakh, Rs 50 lakh respectively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X