Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ట్రస్ట్... మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి భారీ విరాళం!
దర్శకేంద్రుడు, టాలీవుడ్ దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు దర్శకుల సంక్షేమం కోసం సరికొత్త ఆలోచన చేశారు. తెలుగు సినీ డైరెక్టర్స్ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. కష్టాల్లో ఉన్న పేద దర్శకులకు సహాయం అందించాలనే మంచి ఉద్దేశ్యంతో దీన్ని నెలకొల్పారు.
తెలుగు చలన చిత్ర దర్శకుల దినోత్సవం (మే 4) రోజునే రాఘవేంద్రరావు టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం ట్రస్ట్ పెడుతున్నట్లు ప్రకటించారు. తెలుగు సినీ డైరెక్టర్స్ ట్రస్ట్ (టీఎఫ్‌డీటీ) పేరుతో జులై 24న దీన్ని రిజిస్టర్ చేయించారు.
దీనికి కె. రాఘవేంద్రరావు చైర్మన్‌గా ఉండగా... మేనేజింగ్ ట్రస్టీగా ఎన్. శంకర్, ట్రస్టీలుగా వి.వి.వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నందిని రెడ్డి, రాంప్రసాద్, కాశీ, బి.వి.ఎస్.రవి, ట్రెజరర్ గా మెహర్ రమేశ్ వ్యవహరిస్తున్నారు.
ఈ ట్రస్ట్ ప్రకటించిన సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి రూ. 25 లక్షలు విరాళం ఇవ్వగా, రాఘవేంద్రరావు రూ. 10 లక్షలు ఇచ్చారు. తాజాగా ఈ టస్టుకు తన వంతుగా రూ. 50 లక్షలు ప్రకటించారు బాహుబలి డైరెక్టర్ రాజమౌళి. ట్రస్టులో భారీ నిధి ఏర్పాటు చేసి దానిపై వచ్చే వడ్డీ ద్వారా కష్టాల్లో ఉన్న దర్శకులకు సహాయం అందిస్తారని తెలుస్తోంది.