twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రమ్యక‌ష్ణ ఐరన్ లెగ్.. నా పని అయిపోయిందన్నారు.. దర్శకేంద్రుడి సెన్సేషనల్ కామెంట్స్

    |

    తెలుగు సినిమా చరిత్రలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. శృంగారాన్ని అందరూ ఆస్వాదించేలా అందరూ మెచ్చేలా వెండితెరపై అద్భుతంగా చూపించే దర్శకుడు ఈయన. రాఘవేంద్రరావు బీఏ అని మనం చూస్తూ ఉంటాం. ఆయన తీసిన సినిమాల వల్ల బీఏకు అర్థానికి మార్చేశారు ఆయన అభిమానులు. సినీ ప్రేక్షకులు బీఏ అంటే బొడ్డు, యాపిల్ అని సరదాగా మాట్లాడుకుంటారు. ఇటీవలె ఓ షోలో పాల్గొన్న ఆయన ఎన్నో విషయాల గురించి మాట్లాడారు.

    నా పనై పోయిందన్నారు..

    నా పనై పోయిందన్నారు..

    ఈ సినిమాకి ముందు తనకు రెండు మూడు ఫ్లాపులు వచ్చాయని. అందువలన ఈ సినిమాతో తన పనైపోతుందని అందరూ చెప్పుకున్నారు. ఇది విఠలాచార్య చేయవలసిన సినిమా .. రాఘవేంద్రరావు చేసేది కాదు అనే విమర్శలు వినిపించాయి. తీరా సినిమా విడుదల కాగానే భయంకరమైన తుపాను వచ్చేసిందని గుర్తు చేసుకున్నారు. ఎడతెరిపిలేని వాన .. అయినా జనం గొడుగులు వేసుకుని థియేటర్స్ కి వచ్చారని .. థియేటర్స్ వారు జనరేటర్లపై సినిమాను నడిపించారని నాటి సంగతులను నెమరు వేసుకున్నారు. కొన్ని ఊళ్లలో థియేటర్స్ లోకి నీళ్లు వచ్చేయగా, కుర్చీలపై కాళ్లు ముడుచుకుని కూర్చుని మరీ ఈ సినిమా చూశారని, నిజంగా అది ఒక రికార్డని చెప్పుకొచ్చారు.

    రమ్యకృష్ణ ఐరన్ లెగ్..

    రమ్యకృష్ణ ఐరన్ లెగ్..

    హీరోయిన్లను అందంగా చూపించడంలో దర్శకేంద్రుడు దిట్ట. రాఘవేంద్రరావు చేతుల్లో పడకముందు రమ్యకృష్ణకు ఐరన్ లెగ్ అనే ముద్ర ఉండేది. ఆ విషయం గురించి ముచ్చటిస్తూ.. ‘రమ్యకృష్ణపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడినప్పుడు, వాళ్ల పేరెంట్స్ నా దగ్గర చాలా బాధపడ్డారు. 'అల్లుడు గారు' సినిమాలో రమ్యకృష్ణకి కథానాయికగా అవకాశం ఇచ్చాను. ఈ సినిమాలోని 'ముద్దబంతి నవ్వులో' అనే ఒకే ఒక్క పాటతో రమ్యకృష్ణ క్రేజ్ పెరిగిపోయింది.

    స్టేజ్‌పైనే కన్నీళ్లు..

    స్టేజ్‌పైనే కన్నీళ్లు..

    ఆ తరువాత 'అల్లరి మొగుడు' సినిమాలోను ఆమెకి ఛాన్స్ ఇచ్చాను. ఈ సినిమా ఫంక్షన్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది. తనకి గల ఐరన్ లెగ్ అనే ముద్రను నేను తుడిచేశానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. 'ఎవరైతే నిన్ను ఐరన్ లెగ్ అంటున్నారో వాళ్లంతా నీ డేట్స్ కోసం వెయిట్ చేసే రోజొకటి వస్తుందని నేను రమ్యకృష్ణకి ముందుగానే చెప్పాను. అన్నట్టుగానే ఆ తరువాత ఆమె స్టార్ హీరోయిన్ గా బిజీ అయింది' అని చెప్పుకొచ్చారు.

    రాజశేఖర్‌తో అల్లరి ప్రియుడు..

    రాజశేఖర్‌తో అల్లరి ప్రియుడు..

    అప్పటి వరకు రాజశేఖర్ అంటే యాంగ్రీ యంగ్‌మెన్ అనే పేరుండేది. అయితే అలాంటి హీరోతో ప్రేమకథలు, డ్యూయెట్స్, స్టెప్పులు వేయించి కొత్త హీరోను పరిచయం చేశాడు. ఈ సినిమా నాటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. 'అల్లరి ప్రియుడు' కథ రాజశేఖర్ ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిందేనని స్పష్టం చేశారు. 'రాజశేఖర్ తో లవ్ స్టోరీ ఏంటీ .. డాన్సులు ఏంటి.. ఈయనకి ఏమైంది?' అని అప్పట్లో కొంతమంది అనుకున్నారని తెలిపారు.

    స్టెప్పులేంటి.. పాటలేంటి..?

    స్టెప్పులేంటి.. పాటలేంటి..?

    ఈ సినిమా విడుదలైన తరువాత ఆంధ్ర నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ కాల్ చేశాడని, రాజశేఖర్ కి ఆ కాస్ట్యూమ్స్ ఏంటి .. ఆ పాటలేంటి .. ఆ స్టెప్పులేంటి .. మీకు ఏదో అయింది .. ఈ సినిమాతో దుకాణం మూసేయవలసిందేనని అన్నాడని గుర్తుచేసుకున్నారు. ఆయన అలా అన్నందుకైనా ఆ సినిమా బాగా ఆడాలని దేవుణ్ణి కోరుకునేవాడినని చెప్పుకొచ్చారు. 2వ వారం నుంచి వసూళ్లు పుంజుకున్నాయి .. 25 వారాలపాటు ఆడింది. ఆ ఫంక్షన్ కి సంబంధించిన మొదటి ఇన్విటేషన్ కార్డు ఆయనకే పంపించానని చెప్పుకొచ్చారు.

    English summary
    Veteran Directpr k raghavendra Rao In Recent Show Revealed Some Unknown Facts About His Movies. He Commented On Ramyakrishnan, Rajasekhar etc.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X