సైరా అనేసిన రాఘవేంద్ర రావు.. రామ్ చరణ్, చిరంజీవిని ఉద్దేశిస్తూ కామెంట్.. సురేందర్ రెడ్డి రియాక్షన్
Recommended Video
మెగా అభిమానుల ఆతృతను తెర దించుతూ భారీ హంగులతో ప్రేక్షకుల ముందుకొచ్చింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దేశ విదేశాల్లో థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపిస్తోంది. మొదటి షోతోనే భారీ బ్లాక్ బస్టర్ అని నిరూపించుకున్న ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
సైరా అనేసిన దర్శకేంద్రుడు
ఇప్పటికే సైరా నరసింహా రెడ్డి సినిమా చూసిన దర్శక ధీరుడు రాజమౌళి, శ్రీనువైట్ల, మంచు మనోజ్, మహేష్ బాబు, కార్తికేయ లాంటి సినిమా ప్రముఖులు చిరంజీవిపై, సైరా యూనిట్ పై అభినందనల వర్షం కురిపించారు. ఇక ఇప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వంతు వచ్చేసింది. సైరాపై రాఘవేంద్ర రావు స్పందిస్తూ చిత్రయూనిట్ మొత్తాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు.

రామ్ చరణ్, చిరంజీవిని ఉద్దేశిస్తూ
సైరా నరసింహా రెడ్డి సినిమా గురించి వరుస ట్వీట్స్ చేశారు దర్శకేంద్రుడు. ఈ మేరకు ''మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న సైరా నరసింహా రెడ్డి సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలు. ఓ తండ్రికి కొడుక్కిచ్చిన పెర్ఫెక్ట్ గిఫ్ట్ ఇది'' అని పేర్కొంటూ మొదటి ట్వీట్ పెట్టారు రాఘవేంద్ర రావు.

వెంటనే సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి, తమన్నా అంటూ
ఆ తర్వాత వెంటనే సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డిని ఉద్దేశిస్తూ మరో కామెంట్ పోస్ట్ చేశారు రాఘవేంద్ర రావు. ''సురేందర్ రెడ్డి అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ కనబర్చాడు. తన టాలెంట్ అంతా చూపించాడు. ఇక తమన్నా పర్‌ఫార్‌మెన్స్ అబ్బురపరిచింది. ముఖ్యంగా ఆమె చేసిన ప్రీ క్లైమాక్స్ డాన్స్ అదిరింది'' అని పేర్కొన్నారు.

స్పెషల్‌గా చిరంజీవి గురించే..
ఇక స్పెషల్‌గా చిరంజీవి గురించే ప్రత్యేకంగా ఓ కామెంట్ చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. తనకు చిరంజీవి చాలా సంవత్సరాలుగా తెలుసని, అప్పటికీ.. ఇప్పటికీ ఆయన చూపించే అభినయం, డెడికేషన్‌లో ఏ మాత్రం తేడా కనిపించడం లేదని ఆయన అన్నారు. ఆయన చేసిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్ర రియల్లీ మైండ్ బ్లోయింగ్ అనేశారు రాఘవేంద్ర రావు.
సురేందర్ రెడ్డి రియాక్షన్
సైరా నరసింహా రెడ్డి సినిమాపై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేసిన ఈ ట్వీట్స్ చూసి వెంటనే రియాక్ట్ అయ్యాడు ఆ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ''గురువు గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారం, ప్రొత్సాహం తోనే ఈ రోజు నేను ఈ సినిమా చేయగలిగాను'' అని పేర్కొన్నాడు.

సైరా నరసింహా రెడ్డి మూవీ విశేషాలు
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.


Click it and Unblock the Notifications











