twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజీనామా చేసి షాకిచ్చిన రాఘవేంద్ర రావు.. వైఎస్ జగనే కారణమంటూ!

    |

    దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్‌గా గత కొంతకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి తాజాగా ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీ ఈవోతో పాటుగా ప్రభుత్వానికి కూడా పంపించారు. వయస్సు పైబడిన కారణం గానే తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా రాఘవేంద్ర రావు లేఖలో పేర్కొన్నారు. రాజీనామా లేఖలో రాఘవేంద్రరావు ఏమన్నారంటే..

    సేవ చేసే అవకాశం లభించడం అదృష్టం

    సేవ చేసే అవకాశం లభించడం అదృష్టం

    కలియుగ వైకుంఠంలోని వెంకటేశ్వరస్వామికి సేవ చేసే అవకాశం లభించడం అదృష్టం. నా పదవి కాలంలో తనకు సహకరించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ సిబ్బందికి, టీటీడీ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు అని రాఘవేంద్రరావు తెలిపారు. చాలా కాలంగా వివాదాలతో సతమతమవుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ వారు ఇప్పుడు రాఘవేంద్ర రావు రాజీనామాతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఆయన రాజీనామాకు గల కారణాలపై పలు విశ్లేషణలు సాగుతున్నాయి.

    టీటీడీ ఛైర్మన్‌గా రాఘవేంద్రరావు

    టీటీడీ ఛైర్మన్‌గా రాఘవేంద్రరావు

    దర్శకడుు రాఘవేంద్ర రావు 2015 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఎస్వీబీసీ ఛానల్‌కు ఛైర్మన్‌ గా ఉన్న నరసింహా రావుపై ఆరోపణలు రావడంతో ఆయనను తొలగించి.. 2018లో రాఘవేంద్రరావును ఛైర్మన్‌గా టీటీడీ నియమించింది. అప్పటి నుంచి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న ఆయన ఉన్నట్టుండి రాజీనామా చేయడం వెనుక అనేక కారణాలున్నాయని టాక్ నడుస్తోంది.

    బోర్డు సభ్యులు రాజీనామా

    బోర్డు సభ్యులు రాజీనామా

    విజయకేతనం ఎగరేసిన వైసీపీ పార్టీ.. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు సభ్యులు నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తుండటం గమనార్హం.

    వైఎస్ జగన్ విజయమే కారణం

    వైఎస్ జగన్ విజయమే కారణం

    తెలుగు దేశం పార్టీకి అండదండలస్తున్న రాఘవేంద్రరావు కూడా నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా సమర్పించారనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రభుత్వాలు మారినప్పడల్లా ఇలాంటి రాజీనామాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. ఇక తాజాగా రాఘవేంద్రరావు కూడా చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడం వెనుక వైఎస్ జగన్ విజయమే కారణం. అయితే గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి రాజీనామాలను ఆయన తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైఎస్ జగన్ ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.

    English summary
    Kovelamudi Raghavendra Rao decided to side off from SVBC Channel chairmen post.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X