కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'గమ్యం' క్రిష్

By Srikanya

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించబోతున్న కొత్త చిత్రంలో గమ్యం క్రిష్,అజయ్ శాస్త్రి(నేను మీకు తెలుసా దర్శకుడు),రఘు కుంచె(బంపర్ ఆఫర్ సంగీత దర్శకుడు)నిజ జీవిత పాత్రల్లో కనిపించనున్నారు. మంచు మనోజ్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రంలో ఈ సంఘటన చోటు చేసుకోనున్నది. మంచు లక్ష్మీప్రసన్న నిర్మాత. తాప్సీ కథానాయిక. ఇందులో మోహన్‌బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఆదివారం సాయంత్రం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ దర్శకులు రాఘవేంద్రరావుతో నాకూ, మా సంస్థకీ ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. 'అల్లుడుగారు', 'అల్లరిమొగుడు', 'మేజర్‌చంద్రకాంత్‌' మా బంధానికి ప్రతీకలు. ఇప్పుడు మనోజ్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా మా అమ్మాయి లక్ష్మీప్రసన్న చిత్ర నిర్మాణ బాధ్యతలు చూసుకొంటుంది. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారన్నారు.

ఈ సమావేశానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ "ఈ సంస్థ నుంచి వస్తున్న 51వ చిత్రమిది. ప్రేక్షకుల మెప్పు పొందాలన్నారు". కీరవాణి మాట్లాడుతూ ''మేజర్‌ చంద్రకాంత్‌ తర్వాత మా కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. 'ఏం సక్కగున్నావురో నా సొట్ట సెంపలోడా' అంటూ మనోజ్‌పై ఓ పాట కూడా ఉంది. శాస్త్రీయ, పాశ్చాత్య, జానపద సంగీతాల మేళవింపుగా ఉంటుంద''న్నారు. సరదాగా అందరూ వచ్చి చూసే సినిమా ఇది. మనోజ్‌, నాన్నతో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మనోజ్ బాలసుబ్రమణ్యం అనే గాయకుడుగా కనిపించి అలరిస్తారు. అలాగే ఈ చిత్రానికి కూడా బాలసుబ్రమణ్యం అనే టైటిల్ నే పెట్టనున్నారని సమాచారం. మోహన్ బాబు కూడా ప్రత్యకమైన పాత్రలో కనిపించే ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం మనోజ్ గమ్యం దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న వేదంలోనూ, వీరూపోట్ల(రచయిత)దర్శత్వంలో వస్తున్న బిందాస్ చిత్లంలో నూ చే్స్తున్నారు.

ఈ చిత్రంలో సుమన్‌, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఐశ్వర్య, ప్రగతి, క్రిష్‌ జాగర్లమూడి, అజయ్‌ శాస్త్రి, రఘు కుంచె తదితరులు నటిస్తున్నారు. సంగీతం: కీరవాణి, కెమెరా: ఎస్‌.గోపాల్‌రెడ్డి, మూలకథ: భూపతిరాజా, కథ, స్క్రీన్‌ప్లే: గోపీమోహన్‌, బి.వి.ఎస్‌.రవి, మాటలు: శశి రాజసింహ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అశోక్‌ కుమార్‌ రాజు.ఎమ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X