'ఝుమ్మంది నాదం' అంటున్న మంచు మనోజ్
రాఘవేంద్రరావు, మంచు మనోజ్ కాంబినేషన్లో రెడీ అవుతున్న మ్యూజికల్ ఎంటర్టైనర్ చిత్రానికి 'ఝుమ్మంది నాదం' అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసారు. మొదట ఈ చిత్రానికి ఎస్.పి.బాలసుబ్రమణ్యం అనే టైటిల్ ని అనుకున్నారు. కానీ కథను అనుసరించి ఈ చిత్రానికి ఈ టైటిల్ నిర్ణయించామని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఈ చిత్ర నిర్మాత మోహన్ బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ "ఈ కథలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకు తగిన పేరు... 'ఝుమ్మంది నాదం'. మనోజ్ పాత్ర, నటన ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. దర్శకులు రాఘవేంద్రరావుతో మా సంస్థకున్న అనుబంధానికి అల్లుడుగారు, మేజర్ చంద్రకాంత్...ఇప్పుడు ఝుమ్మంది నాదం ప్రతీకలు. మిగిలి ఉన్న గీతాన్ని త్వరలోనే విదేశాల్లో తెరకెక్కిస్తామ"న్నారు. ఇక ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా పరిచయమవుతోంది. మోహన్‌బాబు ఓ విభిన్నమైన పాత్రలో కనిపించునున్నారు. ఓ పాట, కొద్దిపాటి సన్నివేశాలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత ఈ చిత్రంలో సుమన్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు, అలీ, రఘుబాబు, ఐశ్వర్య, ప్రగతి, సుధ, శైలజ నటిస్తున్నారు. మూల కథ: భూపతిరాజా, కథ-స్క్రీన్‌ప్లే: గోపీ మోహన్, రవి బీవీఎస్, మాటలు: శశి రాజసింహ, ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్ రెడ్డి, సంగీతం: కీరవాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్‌కుమార్ రాజు.ఎమ్.


Click it and Unblock the Notifications











