అప్పుడు సమంత వాడిన డ్రెస్‌ను తీసుకుందామనుకున్నా: రాఘవేంద్రరావు రొమాంటిక్ కామెంట్స్
రాఘవేంద్రరావు... తెలుగు సినీ ఇండస్ట్రీలోనే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకరు. వందకు పైగా చిత్రాలను తెరకెక్కించిన ఆయనను ప్రత్యేకమైన శైలి ఉంది. మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానం చాలా స్పెషల్‌గా ఉంటుంది. అందుకే ఆయన సినిమాల్లో నటించాలని చాలా మంది నటీమణులు అనుకునేవారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నా.. సినిమాలకు మాత్రం దగ్గరగానే ఉన్నారు. తాజాగా దర్శకేంద్రుడు హీరోయిన్ సమంత డ్రెస్‌పై రొమాంటిక్‌గా కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారు.? పూర్తి వివరాల్లోకి వెళితే....

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఎంతో మందితో...
రాఘవేంద్రరావు దర్శకుడిగా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. అందులో విజయవంతమైనవే ఎక్కువ శాతం ఉన్నాయి. మరోవైపు, దర్శకేంద్రుడు ఎంతో మంది హీరోలను చిత్ర సీమకు పరిచయం కూడా చేశారు. నాటి తరం హీరోల నుంచి మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. అలాగే, ఆయన ఎంతో మంది హీరోయిన్లను కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు.

సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది
దర్శకేంద్రుడు నిన్న మొన్నటి వరకు వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే, కొన్నేళ్లుగా ఆయన డైరెక్షన్‌కు దూరంగా ఉంటున్నారు. 2017లో నాగార్జున హీరోగా వచ్చిన ‘ఓం నమో వెంకటేశాయ' సినిమా తర్వాత ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. కానీ, ఇండస్ట్రీతో మాత్రం దగ్గరగానే ఉన్నారు. తరచూ ఏదో ఒక ఫంక్షన్‌కు వస్తున్నారు.

మాటలు వచ్చేవి కాదు.. అన్నీ సినిమాలోనే
రాఘవేంద్రరావు ఎన్నో సినిమాలు తెరకెక్కించినప్పటికీ.. ఆయన ఏ సినిమా ఫంక్షన్‌లోనూ అంతగా మాట్లాడేవారు కాదు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే సిగ్గు పడేవారు. కానీ, తన అభిరుచులను మాత్రం సినిమాలో సీన్ల రూపంలో చూపించేవారు. అదే తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే రాఘవేంద్రరావు సినిమాలకు భారీగా డిమాండ్ ఉండేది.

వాటి వల్ల రాఘవేంద్రరావు రహస్యాలు లీక్
కొన్నేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్న ఆయన.. బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ చానెళ్లలో కొన్ని ప్రోగ్రామ్‌లు చేస్తూ తన సినిమాల తాలూకు రహస్యాలను రివీల్ చేసేవారు. దీంతో ఈ షోలను భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ వచ్చేది. అప్పటి నుంచి ఆయన వ్యవహార శైలిలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా బాగా మాట్లాడుతున్నారు.
Recommended Video

సమంత డ్రెస్‌పై రాఘవేంద్రరావు రొమాంటిక్ కామెంట్స్
తాజాగా ‘జాను' థ్యాంక్స్ మీట్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన రాఘవేంద్రరావు.. సమంత డ్రెస్‌పై రొమాంటిక్ కామెంట్స్ చేశారు. ‘సినిమాలో సమంత ఓ కుర్తాను చాలా సేపు వేసుకుని ఉంటుంది. అది వర్షంలో తడిచిన తర్వాత హీరో ఆరేస్తాడు. సినిమా చూశాక దాన్ని అడుగుదామనుకున్నా. కానీ, నేను రామచంద్రను కాదు.. రాఘవేంద్రరావును అని గుర్తొచ్చి మానేశాను' అని ఆయన చెప్పుకొచ్చారు.

‘జాను’.. ‘రామచంద్ర’ మళ్లీ కలిశారు
సమంత - శర్వానంద్ జంటగా నటించిన చిత్రం ‘జాను'. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96'కు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించగా.. మాతృక డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందనను దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











