రాఘవేంద్రరావు 'ఇంటింటా అన్నమయ్య'మొదలైంది
'శ్రీరామరాజ్యం'నిర్మాత యలమంచిలి సాయిబాబు కుమారుడు రేవంత్ లాంచింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్సకత్వంలో ఈ యువ హీరో తెరంగ్రేటం చేయనున్నారు. 'ఇంటింటా అన్నమయ్య'టైటిల్ తో రూపొందే ఈ చిత్రంవ విజయదశమి రోజున ప్రారంభం కానుంది. ఇది సాంఘిక కథాంశంతో రూపొందే చిత్రమే. యువతరం ఆలోచనలకు తగ్గట్టే ఉంటుంది అని చెప్తున్నారు.
అయితే ఈ కథా వస్తువులో అన్నమయ్య కీర్తనలు, ఆయన నెలకొల్పిన సంగీత సంప్రదాయాల్ని ఎలా మేళవించారన్నది సస్పెన్స్ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తారు. త్వరలో తిరుపతిలో సంగీత చర్చలు మొదలవుతాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు చోటుంది. ఒక నాయికగా 'జర్నీ'లో నటించిన అనన్యను ఎంచుకొన్నారు. ఎస్.గోపాలరెడ్డి ఛాయాగ్రహణం అందిస్తారు.
ఇక నాగార్జునతో ఆయన చేసిన 'శిరిడిసాయి' చిత్రాన్ని ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు దర్శకులు కె.రాఘవేంద్రరావు వెల్లడించారు. సాయినాథుని భక్తులు ఇష్టంగా కొలిచే గురువారం రోజున 'శిరిడిసాయి' చిత్రాన్ని విడుదల చేయడం విశేషమని తెలిపారు. రాఘవేంద్రరావు బృందంలో సినీ నిర్మాత యలమంచిలి సాయిబాబు ఉన్నారు.


Click it and Unblock the Notifications












