twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాఘవేంద్రరావు 'ఇంటింటా అన్నమయ్య'మొదలైంది

    By Srikanya
    |

    తిరుపతి : ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు తన తదుపరి చిత్రం 'ఇంటింటా అన్నమయ్య'మ్యూజిక్ సిట్టింగ్స్ తిరుపతిలో మొదలయ్యాయి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని, 'ఇంటింటా అన్నమయ్య' చిత్రం పాటల కంపోజింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం కూడా పాటల కంపోజింగ్‌ జరిగింది. ఇందులో సంగీత దర్శకుడు కీరవాణి బృందం పాల్గొంది. ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ అక్టోబరు నుంచి 'ఇంటింటా అన్నమయ్య' చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు. నటీనటుల ఎంపిక జరగాల్సి ఉందని చెప్పారు.

    'శ్రీరామరాజ్యం'నిర్మాత యలమంచిలి సాయిబాబు కుమారుడు రేవంత్ లాంచింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్సకత్వంలో ఈ యువ హీరో తెరంగ్రేటం చేయనున్నారు. 'ఇంటింటా అన్నమయ్య'టైటిల్ తో రూపొందే ఈ చిత్రంవ విజయదశమి రోజున ప్రారంభం కానుంది. ఇది సాంఘిక కథాంశంతో రూపొందే చిత్రమే. యువతరం ఆలోచనలకు తగ్గట్టే ఉంటుంది అని చెప్తున్నారు.

    అయితే ఈ కథా వస్తువులో అన్నమయ్య కీర్తనలు, ఆయన నెలకొల్పిన సంగీత సంప్రదాయాల్ని ఎలా మేళవించారన్నది సస్పెన్స్‌ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తారు. త్వరలో తిరుపతిలో సంగీత చర్చలు మొదలవుతాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు చోటుంది. ఒక నాయికగా 'జర్నీ'లో నటించిన అనన్యను ఎంచుకొన్నారు. ఎస్‌.గోపాలరెడ్డి ఛాయాగ్రహణం అందిస్తారు.

    ఇక నాగార్జునతో ఆయన చేసిన 'శిరిడిసాయి' చిత్రాన్ని ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు దర్శకులు కె.రాఘవేంద్రరావు వెల్లడించారు. సాయినాథుని భక్తులు ఇష్టంగా కొలిచే గురువారం రోజున 'శిరిడిసాయి' చిత్రాన్ని విడుదల చేయడం విశేషమని తెలిపారు. రాఘవేంద్రరావు బృందంలో సినీ నిర్మాత యలమంచిలి సాయిబాబు ఉన్నారు.

    English summary
    Director K.Raghavendra Rao's 'Intintaa Annamayya' music sittings started in Tirupathi. Revanth, producer Yalamanchali Saibabu's son, is making debut as lead hero in veteran director K Raghavendra Rao's new musical movie. Yalamanchali Saibabu who shot to fame with Bapu directed Sri Ramarajyam is starting his second production introducing his son as hero. Intintaa Annamayya will be launched on the auspicious Dussera festival.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X