రాఘవేంద్రరావు కొడుకుతో అనుష్క? నిజమేనా?
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దృష్టి సౌతిండియా హాట్ హీరోయిన్ అనుష్కపై పడింది. కొంపతీసి ఈ విషయాన్ని మరోలా ఊహించుకోవద్దు. అనుష్క ప్రధాన పాత్రలో ఆయన ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది.
ప్రకాష్ గతంలో 'అనగనగా ఓ ధీరుడు' చిత్రాన్ని భారీ సాంకేతిక పరిజ్ఞానం, గ్రాఫిక్స్ ఉపయోగించి తెరకెక్కించారు. ఖర్చు కూడా ఎక్కువే పెట్టారు. అయితే ఈ చిత్రం బక్సాఫీసు వద్ద బొల్తా పడింది. ఈ చిత్రం కోసం ఆయన చాలా కష్టపడ్డాడు కానీ, ప్రేక్షకులకు సినిమాను కనెక్ట్ చేయడంలో విఫలం అయ్యాడు.

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆయన సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి ఆయన ఎలాంటి కథాంశాన్ని, నేపథ్యాన్ని ఎంచుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అనుష్క రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో బిజీగా ఉంది. గత కొంత కాలంగా ఆమె అసలు ఏ ఇతర సినిమాలు ఒప్పుకోవడం లేదు.
అయితే రాఘవేంద్రరావు స్వయంగా ఆడగటం, రాఘవేంద్రరావు శిష్యుడైన రాజమౌళి కూడా రికమండ్ చేయడంతో.......అనుష్క ప్రకాష్ దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకుందట. ప్రముఖ సౌతిండియా సినీ నిర్మాణ సంస్థ ‘పివిపి సినిమా' అధినేత ప్రసాద్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











