సాయి మహిమ-కొత్త గెటప్‌లో రాఘవేంద్ర రావు
హైదరాబాద్: దర్శకుడు రాఘవేంద్రరావును గడ్డం లేకుండా చూసిన వాళ్లు ఎంత మంది? అంటే చాలా మంది నుంచి చూడలేదనే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే దర్శకేంద్రుడు ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తారు. ఆయన సినీ కెరీర్లో గడ్డం తీసిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. తాజాగా 'షిరిడి సాయి' విడుదల నేపథ్యంలో తను ఎంతో అపురూపంగా పెంచుకున్న గడ్డాన్ని తీసేసారు దర్శకేంద్రుడు.
'షిరిడి సాయి' సినిమా విడుదలను పురస్కరించుకుని నాగార్జున, అమల, నిర్మాత మహేష్ రెడ్డితో పాటు తిరుమల వెళ్లిన రాఘవేంద్రరావు మొక్కుబడి కింద తిరుమలేశునికి తన గడ్డాన్ని సమర్పించుకున్నారు. అనంతరం హైదరాబాద్ వచ్చాక ఇలా గడ్డలేకుండా కనిపించారు. గడ్డం లేక పోయినా దర్శకేంద్రుడు బాగానే ఉన్నాడు కదూ..!
షిరిడి సాయి సినిమా వివరాల్లోకి వెళితే...నాగార్జున షిరిడి సాయి పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు గ్రాండ్‌గా విడుదలైంది. ఈచిత్రం షిరిడి సాయి బాబా చరిత్ర ఆధారంగా రూపొందించారు. ఇప్పటికే సాయిబాబా చరిత్రపై పలు చిత్రాలు వచ్చినప్పటికీ దర్శకేంద్రుడు ఈచిత్రాన్ని తనదైన రీతిలో తెరకెక్కించారు. ముఖ్యంగా నాగార్జున చేస్తున్న సాయి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయిబాబా గెటప్ లో నాగార్జున ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఆడియో మంచి విజయం సాధించింది. తన సినిమాల్లో రక్తి రసాన్ని ఓ రేంజిలో చూపిస్తూ ప్రేక్షకులను మత్తెక్కించే రాఘవేంద్రరావు...అందుకు ఏమాత్రం తగ్గకుండా భక్తి రసాన్ని ఒలికించి ప్రేక్షకులను మైమరిపించడంలో దిట్ట. భక్తిరస చిత్రమైనా ఆయన టేకింగ్ ప్రత్యేకంగా ప్రేక్షక రంజకండా ఉండటమే అదుకు కారణం.
షిరిడి సాయి చిత్రానికి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్: శర్వన్, కళ: భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం: భక్త సురేష్, కథా సహకారం: పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్: ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. విక్రమ్ కుమార్, నిర్మాత: ఎ.మహేష్ రెడ్డి, సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











