దగ్గుబాటి సురేష్ బాబుపై రాఘవేంద్ర రావు షాకింగ్ కామెంట్స్.. లెక్కలు సరిగా చూపాలంటూ!

Recommended Video

Raghavendra Rao Sensational Comments On Daggubati Suresh Babu || Filmibeat Telugu

ప్రస్తుతం టాలీవుడ్ లోని సీనియర్ నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబును ఉద్దేశిస్తూ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కామెంట్ చేశాడు. పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే ఆయన చేసిన ఈ కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమంత తాజా సినిమా ఓ బేబీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాఘవేంద్ర రావు మాట్లాడిన తీరు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి పోతే..

 ఓ బేబీ సినిమా సూపర్

ఓ బేబీ సినిమా సూపర్

సమంత ప్రధాన పాత్రలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది ఓ బేబీ సినిమా. ఈ సినిమా జులై 5వ తేదీన విడుదల కానున్న సందర్బంగా హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు యూనిట్ సభ్యులు. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా విచ్చేసిన దర్శకేంద్రుడు వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ బేబీ సినిమా చూశానని, సూపర్ అని పేర్కొంటూ నిర్మాత సురేష్ బాబుకు ఝలక్ ఇచ్చారు.

 నిర్మాతలకు లాభాల పంట పండుతుంది గానీ

నిర్మాతలకు లాభాల పంట పండుతుంది గానీ

సురేష్ బాబు సహా ఓ బేబీ సినిమాకు మరో ముగ్గురు వ్యక్తులు నిర్మాతలుగా ఉన్నారు. అయితే ఓ బేబీ సినిమాను ఆకాశానికెత్తిన రాఘవేంద్ర రావు ఈ సినిమా నిర్మాతలకు లాభాల పంట పండుతుంది అని అన్నారు. అలా అంటూనే సురేష్ బాబు లెక్కలు సరిగ్గా చెప్పాలని చిన్న ఝలక్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగని దర్శకేంద్రుడు సురేష్ బాబు తనయుడు రానా వైపు చూస్తూ.. ''రానా డాడీకి చెప్పు అక్కౌంట్స్ అన్నీ సరిగ్గా చెప్పాలని, అసలే అన్నీ దాచేస్తుంటాడాయన. నా వాటా కూడా వుంది. జాగ్రత్త '' అని అన్నారు.

చనువు కారణంగానే అన్నాడా? లేక మరేదైనా ఉందా?

చనువు కారణంగానే అన్నాడా? లేక మరేదైనా ఉందా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా, సీనియర్ దర్శకుడిగా రాఘవేంద్ర రావుకి మంచి పేరుంది. ఇండస్ట్రీ లోని ప్రముఖులంతా ఆయనతో ఎంతో చనువుగా ఉంటారు. ముఖ్యంగా అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలతో ఆయనకున్న సాన్నిహిత్యం చాలా ఎక్కువ. దీంతో ఈ చలవ కారణంగానే దగ్గుబాటి సురేష్ బాబు లెక్కల విషయమై ఫన్నీగా మాట్లాడారా? లేక నిజంగానే సురేష్ బాబు లెక్కల్లో మ్యాజిక్ చేస్తుంటాడా? అనే దానిపై చర్చలు మొదలయ్యాయి.

 గతంలో సురేష్ బాబుపై ఇదే రూమర్

గతంలో సురేష్ బాబుపై ఇదే రూమర్

సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుపై ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పటికే ఓ రూమర్ బలంగా ఉంది. ఆయన సినిమాలకు లెక్కలు సరిగా చెప్పరని టాక్ వినిస్తుండేది. సరిగ్గా ఈ తరుణంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమా లెక్కల విషయంపై సురేష్ బాబుకు ఝలక్ ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలంగా మారింది.

 ఓ బేబీ మూవీ

ఓ బేబీ మూవీ

నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ చిత్రంలో 70 ఏళ్ల యువతిగా, 20 ఏళ్ల పడుచు పిల్లగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటించింది అక్కినేని సమంత. ఈ చిత్రంలో సమంత, నాగశౌర్య లీడ్ రోల్స్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ జూలై 5న ఓ బేబీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X