రాఘవేంద్రరావు కొడుకూ...

By Staff

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు సూర్యప్రకాశరావు మొత్తానికి డైరక్టర్ అవుతున్నాడు. రొమాంటిక్ హీరో సిద్దార్ధను అతను డైరక్ట్ చేయనున్నాడు. రేపు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభంకానుంది. గత కొంత కాలంగా సూర్య ప్రకాశ్ స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు. గతంలో సూర్య ప్రకాశ్ నీతో అనే చిత్రంలో నటించారు. ఉషాకిరణ్ వారు నిర్మించిన ఈ చిత్రానికి జాన్ మహేంధ్ర డైరక్ట్ చేసారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తో మార్నింగ్ రాగ చిత్రాన్ని నిర్మిచి నటించారు. ఇంగ్లీష్ లో రూపొందిన ఈ చిత్రం అంతటా ప్రశంసలు పొందింది.

ఇక ఈ తాజా చిత్రం మానవతా విలువలతో నిండిన రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది. సిద్దార్ధ సైతం ఈ చిత్రం స్క్రిప్టు విని ఇంప్రెస్ అయ్యారని సమాచారం. ఇంతకుముందు సూర్యప్రకాశ్ తను తయారు చేసిన స్క్రిప్టులతో తన స్నేహితుడు రాణా తో సినిమా చేద్దామనే ప్రయత్నం చేసారు. కానీ అవేమీ ముందుకెళ్ళలేదు. తన తండ్రిలా కమర్షియల్ చిత్రాల జోలికి వెళ్ళకుండా తనకంటూ ఓ మార్గం వేసుకోవటానికి ప్రయత్నిస్తున్న సూర్యప్రకాశ్ కి దట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X