మహానటి ఆడియో లాంచ్: నాకు ఆ విషయం చెప్పలేదు, బాధపడ్డా.. రాఘవేంద్ర రావు!
భారతీయ చలన చిత్ర రంగంలో దిగ్గజ నటి సావిత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందరో నటులకు ఆదర్శం ఆమె. నటిగా తిరుగులేని ఖ్యాతిని గడించిన సావిత్రి జీవితానికి సంబందించిన ఎన్నో మధురమైన విషయాలు, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె జీవితం గురించి పూర్తిగా అభిమానులకు తెలియదు. సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న మహానటి చిత్రం ద్వారా సావిత్రి జీవితానికి సంబంధించిన అనేక విషయాలని దర్శకుడు నాగ అశ్విన్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో వేడుక నేడు జరగబోతోంది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం విశేషం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ దేవర కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే ఆడియో వేడుక ప్రారంభమైంది.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. సావిత్రి బయోపిక్ చేస్తున్నాని నాగ అశ్విన్ తనకు చెప్పలేదని అందుకు తాను చాలా భాదపడ్డానని అన్నారు. తన జీవితం ప్రారంభమైందే సావిత్రి గారితో అని రాఘవేంద్ర రావు అన్నారు. పాండవ వనవాసం చిత్రానికి తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. అందరిలాగే తాను కూడా మే 9 కోసం ఎదురుచూస్తున్నట్లు రాఘవేంద్ర రావు తెలిపారు.


Click it and Unblock the Notifications











