Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సమంత క్యారెక్టర్‌పై రాఘవేంద్ర రావు కామెంట్
పెళ్లి తర్వాత మంచి జోష్‌లో ఉన్న హీరోయిన్ సమంతపై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఏడాది వరుస సినిమాలతో మంచి హిట్స్ అందుకుంటున్న సామ్.. ప్రస్తుతం 'ఓ బేబీ' చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన రాఘవేంద్ర రావు ఈ చిత్రంలో సమంత నటనను మెచ్చుకుంటూ ట్వీట్ పెట్టారు.
''ఓ బేబీ సినిమా చూశాను. చాలా కొత్తగా, సినిమా చాలా కొత్తగా ఎమోషనల్ గా ఉంది. ఇందులో సమంత.. 70 ఏళ్ళ బామ్మగా చేసింది అనడం కన్నా 70 ఏళ్ళ అనుభవం ఉన్న నటిగా చేసింది అని చెప్పొచ్చు. ఈ సినిమా తనకి ఇంకా పెద్ద పేరు తీసుకొస్తుంది'' అని పేర్కొంటూ ఓ బేబీ ట్రైలర్‌ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు రాఘవేంద్ర రావు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ ఆసక్తిని రెట్టింపు చేసింది. పైగా ఓ బేబీ సమంతకు దర్శకేంద్రుడి ఆశీర్వాదం కూడా లభించడం మరింత ఊరటనిస్తోంది.
#OhBaby సినిమా చూసాను. సినిమా చాలా కొత్తగా ఎమోషనల్ గా ఉంది. @Samanthaprabhu2 70 ఏళ్ళ బామ్మగా చేసింది అనడం కన్నా 70 ఏళ్ళ అనుభవం ఉన్న నటి గా చేసింది. ఈ సినిమా తనకి ఇంకా పెద్ద పేరు తీసుకొస్తుంది. #OhBabyTrailerhttps://t.co/qldqcXDdvb
— Raghavendra Rao K (@Ragavendraraoba) June 20, 2019
మునుపెన్నడూ తన సినిమాలకు అంతలా ప్రమోషన్స్ చేసుకొని సామ్.. ఓ బేబీ కోసం బాగా ప్రమోషన్స్ చేస్తూ వస్తోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే ఇంటర్వ్యూల్లో పాల్గొనడం, సోషల్ మీడియాలో ఓ బేబీకి సంబందించిన విషయాలు పంచుకోవడం లాంటివి చేస్తూ సినిమాపై హైప్ తీసుకొస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ లో తన పేరును కూడా సమంత అక్కినేని నుంచి బేబీ అక్కినేనిగా మార్చేసింది సామ్.
నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ బేబీ చిత్రంలో 70 ఏళ్ల యువతిగా, 20 ఏళ్ల పడుచు పిల్లగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటించింది సమంత. చిత్రంలో సమంత, నాగశౌర్య లీడ్ రోల్స్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ జూలై 5న ఓ బేబీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.