హాట్ న్యూస్ : రాజమౌళికి అసిస్టెంట్‌గా రాఘవేంద్రరావు
హైదరాబాద్ : గురువును మించిన శిష్యుడు అంటే ఇదేనేమో! ఒకప్పుడు రాఘేవేంద్రరావు దగ్గర అసిస్టెంట్‌గా చేరి దర్శకత్వ పాఠాలు నేర్చుకున్న రాజమౌళి ఇప్పుడు నెం.1 దర్శకుడిగా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌గా పని చేయాలని ఉబలాట పడుతున్నాడట రాఘవేంద్రరావు.
రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి' అనే భారీ ప్రాజెక్టును రూపొందించేందుకు ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం స్క్రిప్టును తన గురువు రాఘవేంద్రరావుకు వెల్లడించాడు రాజమౌళి. రాజమౌళి డైరెక్షన్ స్కిల్స్ చూసి ఆశ్చర్య పోయి చాలా ఇంప్రెస్ అయిన రాఘవేంద్రరావు ఆ సినిమాను, అందులోని అద్భుతమైన సీన్లను రాజమౌళి ఎలా తెరకెక్కిస్తారో దగ్గరుండి చూడటానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయాలని డిసైడ్ అయ్యాడట. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభుయార్లగడ్డ స్వయంగా వెల్లడించారు.
సినిమా వివరాల్లోకి వెళితే....ఇందులో రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. రాణా విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో కత్తి యుద్ధాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని కలిగించనున్నాయి.
ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. తాజాగా యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ చిత్రంలో మాజీ స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి లేదా సుస్మితా సేన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి లేదా సుస్మితాసేన్ ఈ చిత్రంలో ప్రభాస్, రాణా తల్లి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అ
ఈగ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు సుదీప్ ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రను పోషించనున్నాడు. ఇటీవల వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. పంజా చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అడవి శేష్ 'బాహుబలి' చిత్రంలో కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. అదే విధంగా తమిళ నటుడు సత్యరాజ్ కబ్బా అనే పాత్రకు ఎంపికయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రామా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు. జూన్ నెలలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











