నాగ్ ఎపిసోడ్ ని డైరక్ట్ చేస్తున్న రాఘవేంద్రరావు

By Srikanya

హైదరాబాద్ : పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటివాటిల్లో కె.రాఘవేంద్రరావు, నాగార్జున జోడీ చెప్పుకోతగినది. మాసూ క్లాసూ అనే తేడాలేకుండా అందరినీ ఆలరించిన కాంబినేషన్‌ ఇది. వారి నుంచి వచ్చిన 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' ప్రేక్షకులకు భక్తి భావాన్ని పంచాయి. త్వరలో వారిద్దరూ కలిసి పని చేయబోతున్నారు.

జె.కె.భారవి దర్శకత్వంలో 'శ్రీ జగద్గురు ఆదిశంకర' అనే చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇందులో నాగార్జున ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఆయనపై తెరకెక్కించే సన్నివేశాలకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ నెల 19 నుంచి హైదరాబాద్‌లో ఇందుకు సంబంధించిన చిత్రీకరణ జరగనుంది. 'నా అభిమాన హీరో నాగార్జునను ఈ పాత్రలో చూడాలని 3 ఏళ్లుగా కలలుకన్నాను. ఆ కలను అవలీలగా ఒక్క స్ట్రోక్ తో నాగం నిజం చేశారు. త్వరలో అన్నమయ్య, శ్రీరామదాసులను మించిన సబ్జెక్టు ఇస్తాను" అంటూ భారవి ఉద్వేగంతో చెప్పారు.

'అన్నమయ్య', 'శ్రీమంజునాథ', 'శ్రీరామదాసు' చిత్రాలకు భారవి రచన అందించారు. ఆ అభిమానంతోనే రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వానికి అంగీకరించారట. ఈ చిత్రంలో మోహన్‌బాబు, శ్రీహరి, సాయికుమార్‌ కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఇక నాగార్జున అయితే భారవి చెప్పిన కథ విని, ఇంత వరకు చిత్రించిన టోటల్ రషెస్ చూసి, అద్భుతంగా ఉందని అభినందిస్తూ ఆది శంకరలో నటించడానికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ విషయమై నాగార్జున మాట్లాడుతూ...హిందూ ధర్మాన్ని నిలబెట్టిన ఆది శంకరుడి దివ్య చరిత్రలో ఆ మహనీయుడి జీవితాన్ని మలుపు తిప్పిన అత్యంత కీలకమైన ఒక మాస్ పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, భారతీయుడిగా అది నాబాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఇందులో హీరో కౌషిక్, రియల్ స్టార్ శ్రీహరి, డైలాగ్ కింగ్ సాయికుమార్, సుమన్, జయప్రద, రోషిణి, రోజా, తులసి, ఆనంద్, నాగబాబు, అశోక్ కుమార్, శివ పార్వతి, సంగీతలతో పాటు మరికొందరు నటిస్తున్నారు. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆది శంకరాచార్య, వేదవ్యాస్ పాటలు అందించగా..నాగ్ శ్రీవత్స సంగీతం సమకూర్చుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X