twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగువాడిగా గర్వపడుతున్నా రాఘవేంద్ర రావు : గౌతమిపుత్ర శాతకర్ణి కి దర్శకేంద్రుడి ప్రశంస....

    ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ సినిమా విషయమై దర్శకుడు క్రిష్ నూ, బాలయ్యను అభినందించగా తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాలయ్యను ప్రశంసించారు

    |

    నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సగటు అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది.అఖండ భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక చక్రవర్తి "శాతకర్ణి" జీవితం ఆధారంగా తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి" భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది..సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాలో డైలాగులుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. థా, కథనం ఆకట్టుకునేలా డిజైన్ చేసారు క్రిష్. ముఖ్యంగా బుర్రా సాయిమాధవ్‌ రాసిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా చెప్తున్నారు.

    శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయాడని.. యుద్ధ సన్నివేశాలు చాలా రిచ్‌గా తెరకెక్కించారని అంటున్నారు. చిత్రంలోని ఎమోషన్స్ ఆయా సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చాయి. ఇక విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు వస్తున్నాయి. డైరక్టర్ గా క్రిష్‌ మరో మెట్టు ఎక్కారని, టేకింగ్‌, కథనం నడిపిన తీరు చాలా బాగుందంటున్నారు.

    Raghavendra Rav Posted about gautami putra Satakarni

    శాతకర్ణి జీవితం బుర్ర కథ చెప్పే పాత్రలో కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్ కనిపించి అలరించారు. గ్రీకు రాజు నహాపనతో శాతకర్ణి చేసే యుద్ధం సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ అంత యుద్దాలు , గ్రాఫిక్స్ తో ఆకట్టుకుంది...బాలయ్య పోరాట సన్నివేశాలను అభిమానులు ఎంజాయ్ చేసారు..ఇక సెకండ్ హాఫ్ కూడా ఆకట్టుకునే రీతిలో ఉంది. శ్రియ, హేమ మాలిని పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉండి కథకు కలిసివచ్చేలా సాగాయి. సాహో శాతకర్ణి అంటున్నారు.

    ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ సినిమా విషయమై దర్శకుడు క్రిష్ నూ, బాలయ్యను అభినందించగా తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాలయ్యను ప్రశంసించారు.''గౌతమిపుత్ర శాతకర్ణి' తెలుగువాడి చరిత్ర. శాతకర్ణి పాత్రలో అత్యద్భుతంగా జీవించిన బాలకృష్ణ తెలుగువాడు. అద్వితీయంగా తెరకెక్కించిన క్రిష్‌ ఓ తెలుగువాడు. తెలుగువాడి చరిత్రను దశదిశలా చాటి చెబుతున్న చిత్ర బృందానికి నా అభినందనలు. సాటి తెలుగువాడిగా నేనూ గర్వపడుతున్నాన'ని రాఘవేంద్రరావు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

    English summary
    Senior Director of Tollywood Raghavendra Rao Posted about gautami putra Satakarni, said that feelig proud to be Teluguvadu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X