twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడుగా రఘు కుంచె 'ఎడారి వర్షం'

    By Srikanya
    |

    సాహిత్యాభిమానులు ఎప్పుడూ ఆనందపడే విషయం..తము చదివి,మెచ్చుకుని అభిమానించిన రచనలు దృశ్యంగా వెండితెరపైకి ఎక్కి మురిపించటం. ఇప్పుడు అలాంటి పక్రియే ఒకటి జరిగింది. ఫేస్ బుక్ అండగా కొందరు ఔత్సాహికులు చేసిన ప్రయత్నం అందరి అభినందనలు అందుకుంటోంది. బాలగంగాధర్ తిలక్ రచన ఊరి చివరి ఇల్లుని వారు ఎడారి వర్షం టైటిల్ తో తెరకెక్కించారు. ప్రముఖ సంగీత దర్శకుడు రఘుకుంచె(బంపర్ ఆపర్)నటుడుగా ప్రధాన పాత్ర చేసిన ఈ చిత్రం ముప్పై నిముషాల లఘు చిత్రం. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన లమాఖాన్ లో శనివారం సాయింత్రం కిక్కిర్సిన జనం మధ్య జరిగింది.

    కత్తి మహేష్ కుమార్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫేస్ బుక్ లో కలిసిన ముప్పై ఎనిమిది మంది నిర్మాతల సహకారంతో ఇది సాధ్యమైందని ఆయన చెప్తున్నారు. రెండున్నర లక్షల బడ్జెట్ లో మూడు రోజుల షూటింగ్ తో తెలుగు ఇండిపెండెంట్ సినిమా బ్యానర్ పై ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. చూసినవారంతా దీన్ని మెచ్చుకోవటమే కాకుండా ఇలాంటి మరెన్నో ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించారు.ప్రస్తుతం రఘుకుంచె ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ రూపొందిస్తున్న దేముడు చేసిన మనుష్యులు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆ చిత్రంలో ఇలియానా,రవితేజ నటిస్తున్నారు.

    English summary
    Raghu Kunche as an actor in 30-minute film Edari Varsham by debutant director Kathi Mahesh Kumar produced by Face Book people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X