Bheemla Nayak: పవన్‌కు వైసీపీ ఎంపీ సపోర్ట్: అరచేతితో సూర్య కాంతిని ఆపలేరు అంటూ!

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు రూపొందుతున్నాయి. అందులో చాలా తక్కువ మూవీలు మాత్రమే భారీ స్థాయిలో బజ్‌ను ఏర్పరచుకుంటున్నాయి. అలాంటి వాటిలో బిగ్ మల్టీస్టారర్ మూవీగా వస్తోన్న 'భీమ్లా నాయక్' ఒకటి. ఇది ఇంతలా ప్రభావాన్ని చూపించడానికి కారణం.. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కలిసి నటిస్తుండడమే అన్న విషయం తెలిసిందే.

Recommended Video

Bheemla Nayak: Ticket Rates పెంపు Pawan Kalyan భీమ్లా నాయక్ కి లాభమేనా ? | Oneindia Telugu

ఈ బజ్ కారణంగానే ఈ చిత్రం బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుపుకుంది. శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జీవో 35తో యూనిట్‌కు షాకిచ్చింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎంపీ ఒకరు పవన్‌కు మద్దతు తెలిపారు. ఆ సంగుతులు మీకోసం!

భారీ మల్టీస్టారర్‌గా భీమ్లా నాయక్

భారీ మల్టీస్టారర్‌గా భీమ్లా నాయక్

పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రమే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలను అందించాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇక, ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

ఆ నేపథ్యంతో... హైలైట్‌గా రోల్స్

ఆ నేపథ్యంతో... హైలైట్‌గా రోల్స్

మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం'కు భీమ్లా నాయక్ రీమేక్‌గా తెరకెక్కింది. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో ఈ సినిమా రూపొందింది. ఇందులో పోలీస్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్‌గా దగ్గుబాటి రానా చేశారు. ఇప్పటికే వీళ్లిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌కు అన్ని వర్గాల నుంచి రెస్పాన్స్ దక్కింది.

 రిలీజ్‌కు రెడీ.. భీమ్లా మేనియానే

రిలీజ్‌కు రెడీ.. భీమ్లా మేనియానే

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్' మూవీ విడుదలపై చాలా రోజుల పాటు సందిగ్ధత నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా దీన్ని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక, అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ ఫీవర్ మొదలైంది. ఈ సినిమా కోసం థియేటర్లను ముస్తాబు చేస్తూ.. ఫ్లెక్సీలు రెడీ చేస్తూ ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తున్నారు.

భీమ్లా నాయక్‌కు ప్రభుత్వం షాక్

భీమ్లా నాయక్‌కు ప్రభుత్వం షాక్

పవన్ - రానా నటించిన ‘భీమ్లా నాయక్' సినిమా రిలీజ్‌కు రెండు రోజులు ముందే ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో జీవో 35ని కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం.. టికెట్ రేట్లను పెంచకూడదని, బ్లాక్‌లో టికెట్లు అమ్మరాదని వెల్లడించింది. అయితే ఈ నెలాఖరు వరకే ఈ జీవో వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

పవన్‌కు వైసీపీ ఎంపీ మద్దతుగా

పవన్‌కు వైసీపీ ఎంపీ మద్దతుగా

‘భీమ్లా నాయక్' మూవీ విడుదలకు ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలులో ఉన్న జీవో 35ను మరోసారి తెరపైకి తీసుకు రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొంది.. ఇప్పుడు వాళ్లకు దూరంగా ఉంటోన్న రఘురామ కృష్ణంరాజు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు.

బెదిరించడం ఎందుకు అంటూ

బెదిరించడం ఎందుకు అంటూ

ఇప్పటికే అమలులో ఉన్న జీవో నెంబర్ 35ను ఇప్పుడు మరోసారి తెరపైకి తీసుకొచ్చి.. ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లకు నోటీసులు జారీ చేయడాన్ని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుబట్టారు. ఈ మేరకు ఓ థియేటర్‌కు ఇచ్చిన నోటీసును షేర్ చేస్తూ ‘ఇప్పటికే నిబంధనలు అమలులో ఉన్నా.. ఇలాంటి బెదిరింపు నోటీసులు ఎందుకు' అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అరచేత్తో సూర్యకాంతిని ఆపలేరు

అరచేత్తో సూర్యకాంతిని ఆపలేరు

ఇదే ట్వీట్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు తన మద్దుతును కూడా ప్రకటించారు. ఈ మేరకు తాజాగా చేసిన ట్వీట్‌లో ‘అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. నేను భీమ్లా నాయక్ వెంట ఉంటాను' అంటూ పేర్కొన్నారు. రఘురామ చేసిన ఈ ట్వీట్‌కు మెగా అభిమానుల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X