Vakeel Saab Jusitce Served.. పవర్ స్టార్ ఇరుగీశాడు.. వరుణ్ తేజ్, శివ నిర్వాణ, వైసీపీ ఎంపీ రివ్యూ
పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం విడుదలై భారీ వసూళ్లతో ముందుకెళ్తున్నది. ఈ సినిమాను వీక్షించిన సినీ, రాజకీయ ప్రముఖులు తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎంపీ కే రఘురామరాజు, వరుణ్ తేజ్, దర్శకులు బాబీ, శివ నిర్వాణ, సంపత్ నంది తదితరులు ట్వీట్లు చేశారు. ట్విట్టర్‌లో వారు ఏమన్నారంటే..

శ్రీరాం వేణు తెరకెక్కించిన విధానం
వకీల్ సాబ్ మూవీలో బాబాయ్ పెర్ఫార్మెన్స్ పవర్ ప్యాక్డ్‌గా ఉంది. వకీల్ సాబ్ సినిమా నచ్చింది. ముగ్గురు హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉంది. శ్రీరాం వేణు సినిమా కథను అడాప్ట్ చేసిన విధానం.. తెరపై చూపించిన తీరు బాగుంది. మ్యూజిక్‌తో థమన్ అదరగొట్టాడు. బీజీఎం అద్భుతంగా ఉంది. జస్టిస్ సర్వ్‌డ్ అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.

అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో
వకీల్ సాబ్‌లో తన అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ఆకట్టుకొన్నారు. తన కమ్ బ్యాక్ మూవీకి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. థమన్ మ్యూజిక్, బీజీయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సమయంలో వకీల్ సాబ్ టీమ్‌కు, దిల్ రాజుకు కంగ్రాట్స్ అంటూ దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు.

థమన్ ప్రతిభ, పీసీ వినోద్ కెమెరా
వకీల్ సాబ్ మూవీ సెన్సేషనల్‌గా ఉంది. పవన్ కల్యాణ్ ట్రెమెండస్ ఫెర్ఫార్మెన్స్. వీసీ వినోద్ సినిమాటోగ్రఫి బాగుంది. నా సోదరుడు థమన్ ప్రతిభ గురించి మాటల్లో చెప్పలేం. శ్రీరాం వేణు తన టాలెంట్‌ను మరోసారి రుజువు చేసుకొన్నారు. భారీ విజయాన్ని అందుకొన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజుగారి అభినందనలు అంటూ దర్శకుడు శివ నిర్వాణ ట్వీట్ చేశారు.

ఫ్రెండ్స్, ఫ్యామిలీతో
వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్ రోజున స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లలో సినిమా చూడటం అద్భుతమైన అనుభూతి. వకీల్ సాబ్ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా సూపర్ ఉమెన్ ఇన్స్‌పెక్టర్ సీన్‌లో మరింత ఎంజాయ్ చేశాను అని హీరో నిఖిల్ సిద్దార్థ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

వావ్ అనిపించేలా వకీల్ సాబ్
వకీల్ సాబ్ చిత్రం వావ్ అనేలా ఉంది. సినిమా చూసిన తర్వాత అద్భుతమైన అనుభూతిని కలిగించింది. పవన్ కల్యాణ్ గెడ్డం, సింగిల్ లైనర్స్. పవన్ కల్యాణ్ టైమింగ్ చూస్తే రోమాలు నిక్కబొడిచాయి. పవన్ కల్యాణ్‌కు తలవంచి నమస్కరిస్తున్నాను అని దర్శకుడు సంపత్ నంది ట్వీట్ చేశారు.

హీరోయిన్ మిషా నారంగ్
వకీల్ సాబ్ థియేటర్లో చూసిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ ఏమిటో ప్రత్యక్షంగా చూశాను. వకీల్ సాబ్ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్ అంటూ హీరోయిన్ మిషా నారంగ్ ట్వీట్ చేసింది.

ఎంపీ రఘురామరాజు ట్వీట్
వైసీపీ ఎంపీ కే రఘురామరాజు వకీల్ సాబ్ గురించి ట్వీట్ చేస్తూ.. నా ఫేవరేట్ హీరో పవన్ కల్యాణ్ సినిమా చూశాను. వెరీ గుడ్ మూవీ. సమాజానికి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చే చిత్రం వకీల్ సాబ్. పవన్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి సినిమా. తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ కామెంట్ చేశారు.
Recommended Video

నాపై కూడా తప్పుడు కేసులు
వైసీపీ ఎంపీ కే రఘురామ రాజు మరో ట్వీట్ చేస్తూ.. పోలీసులు ఎలా తప్పుడు కేసులు పెడుతారో అనే విషయాన్ని వకీల్ సాబ్‌లో స్పష్టంగా చూపించారు. ఆ తప్పుడు కేసుల కోసం పోరాటం చేసే తీరును అద్బుతంగా తెరకెక్కించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులు దాఖలు చేసిన తప్పుడు కేసులతో నేను కూడా బాధపడుతున్నాను. నా వకీల్ సాబ్ కూడా పవన్ కల్యాణ్ మాదిరిగానే తప్పుడు కేసులపై పోరాటం చేస్తారని భావిస్తున్నాను అంటూ రఘురామరాజు అన్నారు.


Click it and Unblock the Notifications











