బర్త్ డే పార్టీలో హీరోయిన్ హల్ చల్.... (ఫోటోస్)
కన్నడ నటి రాగిణి ద్వివేది పుట్టినరోజు వేడుక బుధవారం బెంగులూరులో గ్రాండ్‌గా జరిగింది. కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల మధ్య ఆమె కేక్ కట్ చేసి సంబరాల్లో మునిగి పోయారు.
బెంగుళూరు: కన్నడ నటి రాగిణి ద్వివేది పుట్టినరోజు వేడుక బుధవారం బెంగులూరులో గ్రాండ్‌గా జరిగింది. కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల మధ్య ఆమె కేక్ కట్ చేసి సంబరాల్లో మునిగి పోయారు.
అయితే ఈ పుట్టినరోజు వేడుకలో రాగిణి ద్వివేది నిర్మాతలు, దర్శకులు, పలువురు టెక్నీసియన్స్ తో కలిసి డాన్స్ చేస్తూ హల్ చల్ చేయడం హాట్ టాపిక్ అయింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

రాగిణి ద్వివేది బర్త్ డే సెలబ్రేషన్స్
హీరోయిన్ రాగిణి ద్వివేది బర్త్ డే సెలబ్రేషన్స్. కన్నడలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. 1990 మే 24నలో జన్మించిన ఆమె 27వ వసంతంలోకి అడుగు పెట్టింది.

రాగిణి బ్యాగ్రౌండ్
రాగిణి ద్వివేది పుట్టి పెరిగింది బెంగులూరులోనే అయినా... వారిది పంజాబీ ఫ్యామిలీ. హర్యానా రాష్ట్రంతో కూడా వారి కుటుంబానికి లింక్ ఉంది. ఆమె తండ్రి రాకేష్ ద్వివేది హర్యానాలోని రివారిలో జన్మించారు. ఆర్మీ జనరల్ గా పని చేసారు. తల్లి రోహిణి హౌస్ వైఫ్. ఆమె తాత లాల్ ద్వివేది అప్పట్లో రివేరిలో రైల్వే గార్డుగా పని చేసేవారు.

సినిమాల్లోకి
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రాగిణి ద్వివేది 2009లో వీర మడకరి అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు 25కు పైగా సినిమాల్లో నటించారు.

తెలుగులో...
తెలుగులో కూడా ఆమె ఒక సినిమా చేసారు. జెండాపై కపిరాజు సినిమాలో నాని సరసన నటించింది. అయితే ఆ సినిమా అప్పట్లో విడుదల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బాక్సాఫీసు వద్ద కూడా ఆ చిత్రం పెద్దగా ఆడక పోవడంతో మళ్లీ ఆమె తెలుగు సినిమాపై ఆసక్తి చూపలేదు.

ప్రస్తుతం
ప్రస్తుతం రాగిణి ద్వివేది నానే నెక్ట్స్ సీఎం, ఐ డోంట్ నౌ అనే రెండు కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. రాగిణి ద్వివేది బర్త్ పార్టీకి సంబంధించిన మరిన్ని ఫోటోల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











