twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫేస్ బుక్,ట్విట్టర్ లో నగ్నంగా ఆమె ఫొటోలే..కంప్లైంట్

    By Srikanya
    |

    హైదరాబాద్: ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా తమ సినిమాల ప్రచారం చేసుకుంటున్న హీరో,హీరోయిన్స్ కు ఇక్కడ నుంచి మరికొన్ని సమస్యలుసైతం ఉత్పన్నమవుతున్నాయి. ఫోటోలు మార్పింగ్ చేసి న్యూడ్ ఫొటోలు పెట్టి పరువులు తీసే ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. తాజాగా 'జెండాపై కపిరాజు' ఫేం కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది ఇలాంటి సమస్యను ఫేస్ చేయాల్సి వచ్చింది. దాంతో తను పోలీసులను ఆశ్రయించింది.

    వివరాల్లోకి వెళితే రాగిణి ద్వివేది ట్విట్టర్, ఫేస్ బుక్ లలో లో బాగా యాక్టివ్ గా ఉంటోంది. ఇది గమనించిన కొంతమంది రాగిణి ద్వివేదిపై ఫేక్ ట్విట్టర్, ఫేస్ బుక్ పేజ్ లను క్రియేట్ చేసారు. అలా క్రియేట్ చేసి ఆ పేజెస్ ద్వారా రాగిణి ఫేక్ న్యూడ్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాగిణి షాక్ అయ్యి పోలీసులను ఆశ్రయించింది.

    Ragini Dwivedi falls prey to social network misuse

    బెంగళూరులోని పంజాబీ కుటుంబంలో జన్మించి మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన రాగిణి ద్వివేది ఫెమినా మిస్‌ ఇండియా 2008లో రన్నర్‌ అప్‌ అనిపించుకుంది. 2009లో మిస్‌ బ్యూటిఫుల్‌ హెయిర్‌ అవార్డ్‌కి ఎంపికైంది. అదే సంవత్సరంలో సుదీప్‌ సరసన తెలుగులో విజయ వంతమైన 'విక్రమార్కుడు' ని 'వీర మాదక్కారి' గా రూపొందిస్తే అందులో హీరోయిన్‌గా తొలిసారి నటించి విజయాన్ని కైవసం చేసుకుంది.

    ఈ చిత్రానికి గాను తొలి ఉత్తమ నటి అవార్డుని సువర్ణ ఫిలిం అవార్డులతో దక్కించుకుంది. తరువాత ఆమెనటించిన 'కెంపగౌడ్‌, శివ, బంగారి, రాగిణి ఐపిఎస్‌' చిత్రాలు నటిగా గ్లామర్‌ తారగా గుర్తింపు తెచ్చాయి. ఈ చిత్రాలు ఘన విజయం సాధించడంతో కన్నడ రంగంలో మంచి కథానాయికగానూ పేరు తెచ్చుకుంది.

    ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తులో కొంచెం బొద్దుగా కనిపించే రాగి ద్వివేది తొలి మలయాళ చిత్రం 'కాందహార్‌' 2010 లో విడుదలైంది. ఆమె తొలి తమిళ చిత్రం 'ఆర్యన్‌' 2012లో విడుదలైంది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఆర్‌.రాజకుమార్‌ హిందీ చిత్రంలో నిరుడు ఓ ఐటమ్‌ సాంగ్‌ చేయడంతో అది ఆమె తొలి బాలీవుడ్‌ చిత్రం అయింది. 'జెండాపై కపిరాజు' ఆమె తొలి తెలుగుచిత్రం విడుదల కావలసివుంది.

    అంటే 2009లో చిత్రరంగంలోని అడుగిడి ఇప్పటివరకు 15 కన్నడ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం 5 కన్నడ సినిమాల్లో నటిస్తోంది. ఒక మలయాళ చిత్రంలో, 1 హిందీ చిత్రంలో 2 తమిళ చిత్రాల్లో నటించింది. ఒక తెలుగు చిత్రం 'జెండాపై కపిరాజు', అయిదు భాషల్లో అంటే కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో తీసే 'అమ్మా' చిత్రాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి.

    English summary
    some miscreants created a fake profile of Ragini Dwivedi on Twitter and Facebook and started circulating nude photographs among fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X