వేడెక్కిపోయిన్ హీరోయిన్, ఆసుపత్రిలో చికిత్స!
బెంగుళూరు: కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో పాటు, పలు కోలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతున్న ఆమె శరీరంలో టెంపరేచర్(వేడి) పెరిగి పోవడంతో బెంగుళూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది.

తన అనారోగ్య సమస్యపై రాగిణి ద్వివేది మీడియాతో మాట్లాుతూ..'అవును, నా శరీరంలో టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగి పెరిగి పోయింది. హార్ట్ బీట్ లెవల్స్, బీపీ లెవల్స్ పడిపోయాయి. గత కొన్ని రోజులుగా రెస్టు లేకుండా షూటింగుల్లో పాల్గొంటున్నాను. సమయానికి భోజనం చేయక పోవడం వల్లనే ఇలా జరిగి పోయింది' అని ఆమె వెల్లడించారు.
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న రాగిణి ద్వివేది ముంబైలో షూటింగ్ ముగిసిన వెంటనే ఆమె వెంటనే చెన్నైలో జరిగే షూటింగుకు బయల్దేరిందని, వెంటనే విశ్రాంతి లేకుండా మధురైలో జరిగిన షూటింగులో పాల్గొందని తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే బెంగుళూరు చేరుకుని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొందని, ఈ క్రమంలో అనారోగ్యం పాలైందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











