పాడు చేయరు కదా: 'మిస్సమ్మ' రీమేక్
బెంగళూరు : ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను మరో భాషలోకి డబ్బింగో, రీమేక్ చేస్తూంటారు. అయితే కన్నడంలో డబ్బింగ్ లేకపోవటంతో అన్నీ రీమేక్ లే జరుగుతూంటాయి. అలాంటప్పుడు ఇక్కడ సినిమాను అక్కడ నేటివిటీ పేరుతో ఏమన్నా మార్పులు చేసి, పాడు చేసారా లేక ఇంకా బాగా చేసారా అనే సందేహాలు కలుగుతూంటాయి సినిమా అభిమానులకు.
తాజాగా తెలుగులో మంచి విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు పొందిన 'మిస్సమ్మ' కన్నడలో 'నమస్తే మేడమ్'గా రూపొందుతోంది. ఇటీవలే ఆడియోను విడుదల చేశారు. చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. మిస్సమ్మ పాత్రను రాగిణి పోషించగా నందగోపాల్‌గా శ్రీనగర కిట్టి, భార్యగా నికీశ నటించారు. బుల్లితెరపై అనేక ధారావాహికలకు దర్శకత్వం వహించిన రవి.ఆర్.గిరిణి ఈ సినిమాకు నిర్మాత. రఘురాజ్ దర్శకుడు.

ఆరేళ్ల క్రితమే రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నా చిత్రీకరణలో జాప్యం జరిగినట్లు నిర్మాత తెలిపారు. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నాననే తృప్తి ఉందన్నారు. తెలుగులో విజయం సాధించినట్లుగానే కన్నడలో కూడా ప్రేక్షకాదరణ లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
భూమిక,లయ,శివాజి కాంబినేషన్ లో వచ్చి హిట్టైన మిస్సమ్మ చిత్రం గుర్తుండే ఉంటుంది. నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2003లో విడుదలై ఓల్యాండ్ మార్క్ సినిమాగా బూమిక కెరీర్ లో నిలిచిపోయింది. ఇప్పుడా సినిమా కన్నడ రీమేక్ రిలీజ్ కు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











